Sri Matsya Mahapuranam-1    Chapters   

శ్రీమత్స్య మహాపురాణము

ఆయా అధ్యాయములందలి విశేషాంశములు :

1. అ. శ్లో. 9-10 ఋషులు సూతుని నాలుగు ప్రశ్నము లడిగిరి: 1. భగవానుడు మత్స్య రూపమునంది జగములను ఎట్లు సృష్టించెను? 2. శివుడు భైరవుడు ఎట్లయ్యెను? 3. శివుడు పురారి (త్రిపుర శత్రువు) ఎట్లయ్యెను? 4. ఆ వృషభ ధ్వజుడు కపాలి ఎట్లయ్యెను? ఈ ప్రశ్నములకు సమాదానములు అచ్చటచ్చట చెప్పబడినవి. గమనించవలెను.

శ్లో. 21. 'కోభవాన్‌' ఇది 'కః-భవాన్‌' 'ఎవరవు నీవు?' అని అర్థము కాదు; కమ్‌-జలము; కే-జలే; నీటియందు భవతి-ఉండును;కావున కోభవాన్‌ (కేభవాన్‌); మత్స్యము-అని యర్థము.

2 అ. 1 శ్లో. ఉత్తర క్షయః-ప్రలయః; అసై#్యన ప్రతిసర్గః-ఇత్యపి వ్యవహారః; ప్రతిసర్గ శబ్దమునకు ప్రళయము అనియు అర్థము కలదు; ఇట్లు ఉత్తరక్షయ-ప్రళయ-ప్రతిసర్గ శబ్దములు పర్యాయములు.

శ్లో. 8. ప్రళయకాలీన సప్త మేఘముల నామములు:

సంవర్తో భీమనాదశ్చ ద్రోణ శ్చేంద్రో వలాహకః |

విద్యుత్పతాకః శోణస్తు సపై#్తతే లయవారిదాః.

అర్థము స్పష్టము.

3 అ. 5 శ్లో. మానసులు అగు సుతులు: మనసః-సంకల్పాత్‌; మనస్సునుండి-అనగా సంకల్పము (ఇచ్చాశక్తి తత్త్వము) నుండి జనించినవారు;

వేదాభ్యాస రతస్యాస్య ప్రజాకామస్య మానసాత్‌ |

మనసః పూర్వసృష్టా వై జాతా స్తేనైవ మానసాః.

వేదాభ్యాస నిరతుడును బ్రహ్మదేవుని మానసమునుండి (సంకల్ప వికల్పాత్మక చిత్తవృత్తినుండి) ప్రవర్తిల్లిన మనస్సు (సంకల్పము)నుండి మొదటగా సృష్టింపబడినవారు కావున మరీచ్యాదులు 'మానసులు' అగు పుత్త్రులు అయిరి.

15-23 శ్లో. 'సృష్టం' అనెడు పదము ఇచట 'ప్రకృతి' అను అర్థమును ప్రయోగింపబడినది. 15లో-

'ఏతై రేవ సమం సృష్టం కరోతి వికరోతిచ.'

సృష్టం-ప్రకృతిః; ఏతైరేవ సమం- ఏతైరేవ

తత్త్వైః సహ; కరోతి- ప్రవర్తతే; పరిణమతే;

వికరోతి- ప్రవర్తయతి; పరిణమయతి చ; ఇత్యర్థః.

23లో-'మనః సృష్టం వికురుతే నోద్యమానం సిసృక్షయా.'

సృష్టం-ప్రకృతిః; సిసృక్షయా-స్రక్ష్యామీ త్యాకారయా భగవతః

ఇచ్ఛయా; నోద్యమానం-ప్రేర్యమాణం సత్‌; మనః-

సంకల్ప వికల్పాత్మికాం చిత్తవృత్తిం; వికరోతి-ప్రవర్తయతి; పరిణమయతి; ఇత్యర్థః.

4 అ-శ్లో. 23; 'భరథః'; లభించు ప్రతులలో ఇచట 'భరతః' అనియున్నది; కాని ఆ పదమునకుగల అర్థమునకు ఇచట ప్రసక్తిలేదు; బిభర్తి-భరించును; పోషించును; అను అర్థమున వ్యుత్పన్నమగు 'భరథః' (థ-ప్రత్యయము) అను ఆర్ష రూపమునకు 'అగ్ని' 'ప్రజాపతి' అని అర్థములు; 2వ అర్థముతో ఈ రూపమే ఇచట గ్రహించబడినది.

22-శ్లో. ఋషుల ప్రశ్నమున 'యద్వంశే' అనియున్నది. 'యద్‌' ఇచట సర్వనామముకాదు; 'యదు' అని యర్థము; 'యదువంశే' అన్నచో ఛందోభంగము కనుక రూప వికృతితో 'యద్‌' అని కాని ఛందోభంగముతో 'యదు' కాని ఇక్కడ అంగీకరించవలసినదే.

7 అ-15 శ్లో. 'భవ్యం'-రూపమ్‌! ప్రతిమా; అను అర్థమున ఈ పదము ఇచట ప్రయోగింపబడినది.

'కామనామ్నా హరే ర్భవ్యం స్నాపయే ద్గంధవారిణా.'

'గంధోదకేన (పన్నీటితో) హరేః భవ్యం-ప్రతిమాం-

కామనామ్నా-'మన్మథరూపం హరిం' ఇత్యుద్దిశ్య;

స్నాపయేత్‌-స్నానం కారయేత్‌; ఇత్యర్థః.

శ్లో-36. ఈ శ్లోకపు ఉత్తరార్ధమునకు ప్రకృత ప్రకరణముతో సంబంధము కుదురదు.

శ్లో. 58 'శృత్వా' అనునది సరియగు రూపము; 'శ్రూత్వా' అను రూపముకాదు; 'చీల్చబడి' అని అర్థము;

ఏవ మేకోనపంచాశ చ్ఛృత్వా తే (మారుతాః) రుదితా భృశమ్‌.'

'ఏవం-శృత్వా (చీల్చబడి); నిష్పన్నాః; ఏకోనపంచాశత్‌-

సంజాతాః; తే- మారుతాః; భృశం-అతీవ; రుదితాః-ఇత్యర్థః.

11 అ. 30 శ్లో. 'తేజోహృతం' - తేజసి హృతం; తేజస్సు విషయమున; అపహరించబడిన; తక్కువ చేయబడిన; లేదా-హృతం-హ్రాసితం; తేజః యస్య సః; తక్కువ చేయబడిన తేజస్సు కలవాడు.

'త్వష్టృ' పదము వాస్తవమున 'తష్టృ' అనునది; తృక్ష్‌+తృ (చ్‌)>తష్‌+తృ>తష్‌-టృ>తష్టృ); అగును; చెక్కెడువాడు అని యర్థము; ఇతడు దేవతల మొదటి వర్ధకి (వడ్లంగి); ఆది ప్రజాపతులలోనివాడు.

'నాసత్యౌ' (అశ్వి దేవతలు); ఈ విషయమున పురాణములలో ఇచ్చుచున్న కథ జుగుప్సాకరముగా నున్నది; ఇందలి సత్యా సత్యములు కాని తర్క సంగతమగు రహస్యార్థము కాని విచారించదగినదికాదు; కాని శబ్ద పరిణామమును ఇట్లూహించవచ్చును; అనస్‌+త్యౌ>నాస్‌-త్యౌ ('అన'లోని 'అ' లోపించి-'న' లో చేరి 'నా' ఐనది; నాస్‌+(అ)+త్యౌ>నాసత్యౌ-అగును. అనస్‌-అనగా బండి; అశ్విదేవతలు త్రిభుజాకారపు బండియందున్నట్లు కనబడుదురు; అనుట వేదాదిక మందు ప్రసిద్ధము; దృష్టికిని అట్లే గోచరించును; కనుక 'నాసత్య' శబ్దమునకు యాస్కాచార్యులు చెప్పినది ఎట్లున్నను ఈ విధమగు శబ్ద రూప పరిణామము సమంజసమని తోచుచున్నది.

ఇచ్చటనే 'దస్రోష్ఠ సంజాతౌ' అని వీరిని గూర్చి మరియొక పదము; 'దస్రము' అనగా అశ్వము; 'ఓష్ఠము' అనగా పెదవి అను అర్థములు ఎట్లున్నను-వహ్‌ (వహ-ప్రాపణ-ఒకచోటినుండి మరియొక చోటికి తీసికొనిపోవుట); ఈ 'వహ్‌' ధాతువునుండి కర్మార్థమున 'థ' ప్రత్యయముచే వహ్‌+థ) ఉహ్‌+>ఉష్‌+>ఓష్‌+థ-కాగా 'ఓష్ఠ' శబ్దము ఏర్పడును; బండియని యర్థము; ఇట్లు 'దస్రోష్ఠము' అనగా గుర్రములచే లాగబడు బండి; దానినుండి పుట్టిన వారని అర్థము.

56. శ్లో. 'పవిత్రకమ్‌'-దండము; దండమును ధరిచిన బ్రహ్మచారులు మొదలగువారు పవిత్రకులు.

26-34 శ్లోకములు; ఈ సందర్భములో శ్రీదేవీ భాగవతమునందును-లభించు మత్స్యపురాణపు ప్రతులందును 'మేరుదేశము' అని యున్నది;భూలోకమునందు మేరుదేశము అనునది ఊహించుటకంటె దీనిని 'మరుదేశము' అని గ్రహించుట సమంజసతరము; కనుక ఆ పాఠమే ఇచట గ్రహించబడినది.

12 అ. 15 శ్లో.

'ఏవం పురూరవాః పుంసో రభవ ద్వంశవర్దనః.'

ఇచ్చట 'పుంసోః' అనగా 'తనకు జన్మకారణులగు వారికి' అని అర్థము; పురూరవసునకు తల్లి-స్త్రీత్వమునందిన ఇలుడు: ఇతడు సూర్యవంశీయుడు: ఈ పురూరవసుని తండ్రి బుధుడు చంద్రవంశీయుడు: అతడు ఈ ఇరువురకును వంశ వర్ధనుడు-వంశమునకు వృద్ధిని-శుభమును-ఆనందమును-కలిగించువాడు. (సూతేః నఃప్‌ ప్రసవే పుమాన్‌. పుంస్‌=సవితా; జన్మకారణుడు)

15 అ. 7 శ్లో. 'వదతాం వరః'; వదంతః- వ్యక్త (స్పష్ట) వాక్యులతో మాటలాడగలవారు; పురుషులు (మానవులు); వారిలో వరః- శ్రేష్ఠుడు; 'పురుషోత్తముడు'అని అర్థము.

15 అ. 31 శ్లో. 'అగ్నీఫోమయమాభ్యామ్‌' 'యములు' అనగా 'జంటగా నున్నవారు'; అగ్నీషోములు' అనెడు దేవతా ద్వంద్వమునకు (దేవతల జంటకు) అని అర్థము.

16 అ; 27 శ్లో. మేక్షణమ్‌; మిషు- సేచనే; భ్వాది; 'ల్యుట్‌' ప్రత్యయము; మిష్‌+అన>మేక్ష్‌+అన>మే క్షణమ్‌; ఇది ఆర్షరూపము; ద్రవద్రవ్యమును చిలుకరించుటకు ఉపయోగించు సాధనము; శ్రౌత సంబంధి.

చండ శబ్దార్థము (శ్రాద్ధకల్పము)

'చండీ' 'చండ' శబ్దములు రెండును 'చడి' కోపే అను ధాతువునుండి నిష్పన్నములు అనియు అందుచే 'కోపముచే తీవ్రమగు స్వభావముకల'- అని ఈ శబ్దములకు అర్థము అనియు వాడుకలో నున్నది. కాని మత్స్యపురాణ ములో ఇరువదియొకటవ అధ్యాయమున (శ్రాద్ధకల్పమున) ఈ శబ్దము 'శౌండః' 'నేర్పరి' 'కుశలుడు' అనునర్థమున ప్రయోగింపబడినది. దీనిని బట్టి ఈ రూపము 'చడి' ధాతువునుండి నిష్పన్నమగుట మాత్రమేకాక సంస్కృతమునందే శౌండ శబ్దమునుండి వర్ణ వికృతిచే ఏర్పడినదియు కలదు అని చెప్పవచ్చును. శ-చ-హల్లులు తాలవ్యములు; అచ్చులలో 'ఔ' కంఠోష్ఠ్యము కాగా 'అ' కంఠ్యము. ఇట్లు ఈ రూపమునకు భాషాశాస్త్రీయ ప్యుత్పత్తి చెప్పవచ్చును.

'స్వధా'శబ్ద వ్యుత్పత్తి (శాద్ధకల్పము)

పితృదేవతోద్దేశక కర్మములందు 'స్వధా' శబ్దమును దేవతారాధన విషయక కర్మానుష్ఠానములందు 'స్వాహా' శబ్దమును మానవులకు అన్న దానాదికము చేయునపుడు 'హంత' శబ్దమును వినియోగించవలెను. అనుట ఆర్ష సంప్రదాయము. వీనినే 'స్వాహా'కార 'స్వధా'కార 'హంత' కారములందురు.

ఇందు 'స్వధా' శబ్దమును 'నాందీ' 'వృద్ధి' 'శుభ' శ్రాద్ధమునందు వినియోగించరాదు. దానికి మారుగా 'స్వదితమ్‌' అను శబ్దమును వినియోగించవలెను. అని మత్స్యమహాపురాణము శ్రాద్ధకల్పమున చెప్పుచున్నది. వ్యుత్పత్తిచే ఈ రెండు శబ్దములును సమానార్థకములే.

వ్యుత్పత్తి : 'ను' అను ఉపసర్గము పై అద-(అద్‌) ధాతువునుండి 'క్త' (త) ప్రత్యయము చేరగా ఇట్‌ (ఇ) ఆగనుము కాగా సు-అద్‌-ఇ-త> 'స్వదిత' అగును. 'చక్కగా తినబడినది అగుగాక!' అని అర్థము.

సు-అద్‌+అస్‌ (భావార్థమున)>స్వదస్‌ > స్వదహ్‌ (స్‌>హ్‌)>స్వధా అగును. హకారమహాప్రాణాంశము దకారములో చేరినది- కనుక రెండు శబ్దములకును వ్యుత్పత్తియు అర్థమును ఒక్కటియే. శుభాశుభ కర్మభేదమును బట్టి రూపభేదముతో ఈ శబ్దములకు వినియోగమున భేదము.

గాథాః (గాథలు)

'గాయతి చోదితాః మంత్రాః-గాథాః' అని యజురారణ్యక భాష్యమున శ్రీ సామనాచార్యులు. దీనికి వివరణము : 'గాయతి- ఆయం ఇత్థం గాయతి- ఇతిరూ పైః వాక్యైః- చోదితాః విహితాః యే మంత్రాః- తాః గాథాః.'

ఈతడు ఇట్లు గానము చేయుచున్నాడు. అను ఇటువంటి వాక్యములతో చోదితములు- విహితములు- (చోదన అనగా విధి) అగు మంత్రములు 'గాథ'లు. గై-శ##బ్దే అను థాతువునుండి 'థ' ప్రత్యయమును- స్త్రీత్వమున 'ఆ'ప్రత్యయమును.

నారాశంస్యః.

ఈ 'నారాశంస్యః' శబ్దము 'నారాశంసీ' ప్రాతిపదికమునకు ప్రథమా బహువచన రూపము; 'నరాశంస'అను పదమును అనుసంధానముచేసి గ్రథనము (కూర్పు) చేయబడిన మంత్రములు 'నారాశంస్యః' 'నారాశంసీ మంత్రములు' అని యజురారణ్యక భాష్యమున సాయణ్ణాచార్యులు.

'హోతా యక్ష న్నరాశంసగ్‌ం'

ఇత్యాది రూపాః 'నరాశంస' పదేన గ్రథితాః మంత్రాః నారాశంస్యః ఇతి.

కుతప శబ్దార్థము (శ్రాద్ధకల్పము)

ఈ విషయము మత్స్యమహాపురాణమున 22వ అధ్యాయమున శ్రాద్ధకల్పమున ఉన్నది. అచట కొంత వివరణము ఈయబడియున్నది. 'పాపము' కుత్సితము (నిందితము) అనబడును. ఈ చెప్పిన మధ్యాహ్నము ఖడ్గపాత్రము నేపాల కంబళము దీపము దర్భలు తిలలు గోవులు దౌహిత్రుడు (పుత్త్రీపుత్త్రుడు) అను ఎనిమిదియు కుత్సితమును సంతాపము నొందించును (సమ్‌-సమగ్రముగా- తపింప- దహించ- జేయును) కావున వీనికి 'కుతప' అని వ్యవహారము. అని శ్లోకమునకు అర్థము. కు(త్సిత)+తప>కుతప.

కాని ఖడ్గ పాత్రము-నేపాల కంబళము-వంటి అర్థములలో ఈ శబ్దము ఈ వ్యుత్పత్తితో ఏర్పడినది కాదనియు మరి ఏదో భాషనుండి గ్రహింపబడియుండును. అనియు తోచును. మధ్యాహ్నము అను అర్థమున మాత్రము కుః- భూమిః- తప్యతే- అస్మిన్‌- కాలే- ఈ సమయమునందు భూమి తపింప (వేడెక్కునట్లు) చేయబడును. కావున 'కుతపము' అని చెప్పుట సమంజసము.

షడశీతిముఖము (శ్రాద్ధకల్పాధ్యాయములు)

ఇది పుణ్యకాల విశేషము. దీని విషయము సూర్యసిద్ధాంతమునందు ఇట్లున్నది : (మానాధ్యాయః - శ్లో. 4.5.)

''తులాది షడశీత్యహ్నాం షడశీతిముఖం క్రమాత్‌ |

త చ్చతుష్టయ మేవ స్యాత్‌ ద్విస్వభావేషు రాశిషు.

షడ్వింశే ధనుషో భాగే ద్వావింశే7నిమిషస్యచ |

మిథునాష్టాదశే భాగే కన్యాయాస్తు చతుర్దశే.''

''రవి ఒక్కొక్క దినమునకు ఐక్కొక్క భాగ చొప్పున 360 దినములలో పండ్రెండు రాసులందు సంచరించును. రాశికి 30 భాగలు (Degrees); సూర్యుడు తులారాశియందు ప్రవేశించినది మొదలు ప్రతియొక ఎనుబది యారు దినముల(భాగల)సంచారమునకు ఒకసారి ఈషడశీతిముఖము అను పుణ్యకాలము వచ్చును; (షడశీతి=షట్‌+అశీతి=86); ఇట్లు ఈ పుణ్యకాలము ద్విస్వభావరాసులగు ధనుర్మీన మిథున కన్యారాసులలో రవియున్నకాలమున ఏర్పడును. అనగా తులా ప్రథమభాగ నుండి 86వ భాగ అనగా ధనువునందలి 26వ భాగయగును; దానినుండి 86 భాగ-మీనమునందలి 22వ భాగయగును; దానినుండి 86వ భాగ-మిథునమునందలి 18వ భాగయగును; దానినుండి 86వ బాగ-కన్య యందలి 14వ భాగయగును. ఇవి శ్రాద్ధాచరణ యోగ్యకాలములు.

ఇట్లు రవి తులయందు ప్రవేశించినది మొదలు నాలుగు షడశీతిముఖములకును 86 x 4=344 భాగలు (దినములు) అగుచున్నవి. ఇక సంవత్సరములో (భచక్రమునకు సంబంధించిన 360 భాగలలో) 14 భాగలు (దినములు) మిగిలి యుండును. ఈ పదునాలుగు దినములుకూడ అత్యంత పుణ్యదినములు. శ్రాద్దాదులకు యోగ్యములు.

గజచ్ఛాయ

ఇదియును శ్రాద్ధోచితమగు పుణ్యకాల విశేషము.

''సైంహికేయో యదా భానుం గ్రసతే పర్వసంధిషు |

గజచ్ఛాయా తు సా ప్రోక్తా తత్ర శ్రాద్ధం ప్రకల్పయేత్‌.''

పర్వసంధి యనగా పూర్ణిమా-కృష్ణ ప్రతిపత్‌లకును-అమావాస్యా-శుక్లప్రతిపత్‌లకును సంధికాలము; ఇట్టి అమా వాస్యాశుక్లప్రతిపత్‌ సంధిరూపమగు కాలమున రాహువు రవిని పట్టినచో అట్టి పుణ్యకాలము ''గజచ్ఛాయ'' అనబడును. ఇందు శ్రాద్ధాచరణము అత్యంత పుణ్యప్రదము.

విష్టి

తిథి వార నక్షత్ర యోగ కరణములు కాలపు పంచాంగములు; చంద్రసూర్యుల పరస్పర దూరముపై గణింపబడు నది యోగము; తిథి భుక్తిననుసరించి గణన చేయబడునది కరణము; ఇందు ఒక్కొక్కటి 30 గడియలు(12 గం)ఉండును. కరణములు 11; ఇందు ఏడవది 'భద్రా' కరణము; దీనికే విష్టి అని పేరు. ఇది యంతయు దోషప్రదమే. (తిథి పరిమాణమును బట్టి కణ పరిమాణము మారవచ్చును.)

ఎట్లన-ఇందలి మొదటి 5 గడియలు కార్యధ్వంసము-తరువాత 1 గడియ మరణము-తరువాత 11 ధననాశము-తరువాత 4 బుద్ధినాశము- తరువాత 6 కలహము తరువాత 3 సర్వనాశము కలిగించును.

ఈ విష్టిపురుషుని ఉత్పత్తికథ ఈ మత్స్యపురాణమున 11వ అధ్యాయమున నున్నది.

ఇట్లయినను ఇది శ్రాద్ధమాచరించ యోగ్యమగు మహా పుణ్యకాలము.

23 అ. శ్లో. 47. ఇందు చంద్రునకు పాపగ్రహత్వము చెప్పబడినది.

25 అ. 50 శ్లో. శుక్రవచనము :

'వధేన యత్తేన మే జీవితం స్యాత్‌.'

'యత్‌-తేన జీవితం మే వధే స్యాత్‌.'

'ఏలయన-అతనితో (నీవు-దేవయాని) జీవించుట నావధతోనే జరుగును.'

63 శ్లో. 'వత్స్యతి మత్స్యమీపే!' నా సమీపమున నివసించును.' అని మాత్రమే అర్థముకాదు; సమీపము అను అర్థమున 'అంత' శబ్దము కలదు; కావున ఇక మీదట ఇతడు నాకు 'అంతేవాసి'-శిష్యుడు అగును. అని యర్థము.

26 అ. 17 శ్లో. కచుడు దేవయానితో-

గురుపుత్త్రీతి కృత్వ7హం ప్రత్యాచక్షే; న దోషతః.

ఇందు-గురుపుత్త్రీతి కృత్వా-

అనునది 'గురుపుత్త్రివగుటం జేసి' అను తెలుగు రూపమునకు మూలము; మరియు-'దోషతః' అను 'పంచమ్యర్థక తసిల్‌' సాహచర్యముచే'పట్టి' యను పంచమీ విభక్త్యర్థక రూపమును 'చేసి' యనునదియును ఇంచుమించు సమానార్థకములని తోచును.

32 అ. 70 శ్లో.

'తమేవాసురధర్మం త్వ మాస్థితా నబిభేషి మామ్‌.'

పంచమ్యర్థక ద్వితీయా కారక విశేషము;

మాం న బిభేషి-మత్‌ (నావలననుండి) న బిభేషి-

(భయపడుచున్న దానవు కావు) అను అర్థములో.

40అ.శ్లో.1.ఆచార్యకర్మా-బ్రహ్మచారీ; యః-ఆచార్యే-కర్మ-వ్రతం-అధ్యయనవ్రతం-కరోతి- ఆచరతి-సః.

43 అ. 30 శ్లో. 'ప్రతిస్రోతః' సముద్రములో వచ్చు పోటు (Tide)

29 శ్లో. మహా+అహి-మత్‌-ఈ> మహా+అహి+ష్‌-మత్‌+>మాహిష్మతీ (మహా>మా) కర్కోటక సుతుడు-అగు మహా7హి-గొప్పనాగుడు-తనకు అధిపతిగా కలది.

43 అ. 7-8 శ్లో. 'జి' ధాతువునుండి నిష్పన్న మగు 'జిత్‌' అనునది 'జి' అను రూపముతోకూడ కలదు; సహస్రజిత్‌; సహస్రజి; శతజిత్‌; శతజి; ఇట్లుండగా ఇంద్రజిత్‌-ఇంద్రజి అగుననుటకు చిన్నయసూరి తత్పమ ప్రకరణమున ఈ రూపము తత్సమత్వముచే వచ్చెనని వ్రాయుట అనావశ్యకమనవచ్చును.

43 అ. 35 శ్లో. 'అతి చలం-మిగుల చంచలము' అని అర్థము కాదు; చలం-అతీతాః-చంచలత్వమును అతిక్రమించినవి; నిశ్చలములు; స్తిమితములు-అని యర్థము.

44వ అధ్యాయము; ఇందు 34 శ్లో. తరువాత

'నాహం ప్రసూతా పుత్త్రేణ'

అను శ్లోకమునకు తరువాత 'భార్యా మువాచ'

ఇత్యాది శ్లోకము అన్ని ప్రతులయందును కనబడుచున్నది; కాని ఇది అన్వయమునకు సరిపోదు; కనుక ఇట ఇది అన్వయానుగుణముగా 'భార్యా మువాచ' ఇత్యాది శ్లోకమునకు తరువాత చేర్చబడినది.

44 అ. 58 శ్లోకమున 'సహప్రజా' అను పాఠము 'సహ ప్రజాః' అని సవరించబడినది; ఇది 'సుప్రజాః' వలె సకారాంతమగు ఆర్షరూపము.

44 అ. 71 శ్లో. 'అథ' అనునది 'సు' అను అర్థమున:

'రథానా మథ ఘోషాణామ్‌;'

'అథఘోషాణామ్‌='సుఘోషాణామ్‌'

'శోభనమగు ధ్వనులు కలిగిన' 'రథానామ్‌' 'రథములయొక్క' అని యర్థము.

45 అ. వృష్ణికి కుమారుడు దేవమీఢ్వాన్‌; అని 45 వ అధ్యాయమునందలి 1-2 శ్లోకములు చెప్పుచున్నవి. కాని మరల 46వ అధ్యాయారంభమునందలి 1వ శ్లోకమున 'ఐక్ష్వాకీ' అనునామె శూరుడగు అద్భుతమీఢుషుని కనెను. అను అర్థమునిచ్చు 'ఐక్ష్వాకీ జనయామాస శూర మద్భుత మీఢుషమ్‌.' అను పం క్తి ప్రతులయందు కనబడుచున్నది; ఆలోచింపగా ఇచట 'దేవమీఢుషు'నకు 'ఐక్ష్వాకి' యందు కలిగిన కుమారుడు శూరుడు; కావున ఇచట 'అద్భుతమీఢుషమ్‌' అను ద్వితీయా-విభక్త్యంత రూపము కాక 'అద్భుత మీడుషః' అను పంచమీ విభక్త్యంత రూపము ఉండదగును. 'జీమూతవాహన' శబ్దమును ఛందో7నుకూలతకై 'మేఘవాహనుడు' అనినట్లు ఇచట ఛందో7నుకూలతకై 'దేవమీఢుషః' అనునది 'అద్భుతమీఢుషః' అని గ్రహింపబడియుండును. ఇచట ప్రాత ప్రతులను అనుసరించి 'అద్భుతమీడుషమ్‌' అను రూపము ఈయబడినను దీనిని 'అద్భుతమీఢుషః' అనియే చదువుకొనవలయును.

46 అ. 6 శ్లో.

'ధర్మశారీరః=ధర్మాత్మా; శారీరః-(శరీరం అస్య అస్తీతి-ఆత్మా;

'శారీరక మీమాంసా' 'ఆత్మ తత్త్వ విషయక మీమాంసా.'

47 అ. 133 శ్లో. హర్యక్షః-కుబేరుడు; ఇచటనే 'అంధసః పత్యే' అను నర్థమున 'అంధస పతే' అని ప్రతులలో కనబడుచున్నది; కాని ఛందోభంగమును సహించి 'పత్యే' అని చదువుకొనుట సమంజసము.

47వ అధ్యాయమున చెప్పబడిన దేవాసుర సంగ్రామములు పండ్రెండు; వాటి స్వరూపమును తత్ఫలితములగు సంఘటనములును మత్స్యపురాణమున చెప్పబడినవి; ఇవియే విషయములుగాని ఇక్కడ పేర్కొనబడిన యుద్ధములలో కొన్నిటి (ఉదా: ఆడీ బక-ఆడీవధ) నామములు కాని ఇతర పురాణములలోను వచ్చుచున్నవి. కాని అచ్చట తద్వివ రణము వేరు విధముగా నున్నది; ఈ మత్స్య పురాణమునగూడ పాఠములు కాలక్రమమున గందరగోళముగ మారినందున కొన్ని యుద్ధములను గూర్చిన వివరణములు మూలములో చెప్పనేలేదేమో యనిపించును. కాని పూర్వోత్తరములు జాగ్రత్తతో పరిశీలించి పాఠములను పునర్నిర్మాణము చేసినచో అన్ని యంశములును ఇందు చాల సరిగి చెప్పబడినట్లు తెలియును.

47 అ. 58-63 శ్లో. హిరణ్యకశిపుని రాజ్యకాలము-107280000¸360=2980000 దివ్యవర్షములు; బలి పాలనకాలము=2070000¸360 = 5750 దివ్యవర్షములు; ఇది నియుతాని వింవతిః+ఏకాయుతం+షష్టిర్వర్ష సహస్రాణి =2000000+10000+60000=20700000.

47 అ. 172 శ్లో.

భూర్లోకో7థ భువర్లోకః స్వర్లోకో7థ మహర్జనః |

తపః సత్యంచ సపై#్తతే దేవలోకాః ప్రకీర్తితాః. (మత్స్య-61 అ.)

అను ప్రమాణము ననుసరించి భూర్లోక-భువర్లోక-సువర్లోక-మహర్లోకముల నాలుగింటిలో మహర్లోకము చివరది; కావున 'మహాంతేషు చతుర్షు; మహర్లోకము కడపటిదిగా నాలుగు లోకములు; అటులే మహర్లోకము-జనలోక-తపోలోక -సత్యలోకములు అను నాలుగు లోకములలో చివరది సత్యలోకము కావున 'సత్యాంతేషు చతుర్షు'అనుట సరిపోవుచున్నది.

47-48 అధ్యాయములలో ఉత్తమములు ఉదా త్తమములును అగు విషయములు ఎన్నియో యున్నవి. వీనిలో బలి చక్రవర్తి మహత్తయు ఉతథ్యవృత్తాంతమును కక్షీవదాదుల వృత్తాంతమును మిగుల ప్రధానములు.

48వ అధ్యాయమున కర్ణుడు అంగరాజపుత్త్రుడును సూతపుత్త్రడును ఎట్లయ్యెను? అను ప్రశ్న మునకు సమాధానము ఈయబడినది. దానిని ఇట్లు వివరించవచ్చును. యయాతి కుమారులలో 'అనువు' అను వాని వంశమున బృహద్భానుని పుత్త్రడు బృహన్మనసుడు; అతని భార్యలు ఇరువురలో యశోదాదేవియందు జయద్రథుడు అతనికి బృహద్రథుడు అతనికి జనమేజయుడు అతనికి అంగుడు కుమారులయిరి; ఈ బృహన్మనసునకే అతని రెండవ భార్యయందు విజయుడు అతనికి బృహత్‌ అతనికి బృహద్రథుడు అతనికి సత్యకర్మన్‌ అతనికి సూతుడు కుమారులయిరి. ఇట్లు బృహన్మనసునినుండి ఐదవతరమువాడు అంగుడు; ఈ బృహన్మనసునినుండియే ఆరవతరమువాడు సూతుడు; అంగునకును సంతతి లేదు; బృహన్మనసుని జ్యేష్ఠ భార్యాసంతతివాడగుటచే అంగునకు రాజ్యముండెను. సూతునకు లేదు. అతడు బహుశః క్షత్త్రయ ధర్మములోని అంశముగా రథనిర్మాపణముతో జీవనము చేయుచు ధనాఢ్యుడై యుండవచ్చును. ఇతనికి లభించిన కర్ణుని ఈతని పెదనాయన (తరముల వరుసలో) అగు అంగుడు చేరదీసి తన రాజ్యము నీతని కిచ్చెను. ఇట్లు కర్ణుడు సూత పుత్త్రుడును అంగపుత్త్రుడును అయ్యెను.

మొత్తము మీద సూతుడు చంద్రవంశ్యుడగు క్షత్త్రయుడే కాని రథచోదక జాతీయుడు కాదు.

48 అ. 55 శ్లో. అభ్యపద్యత-స్త్రీని పొందెను; కూడెను.

48 అ. 39 శ్లో. సంబభూవ-(స్త్రీని) పొందెను.

48 అ. 79 శ్లో. యత్‌ (ఎందువలన ననగా) అను నర్థమున ఛందో నిర్వహణమునకై 'యది' అనురూపము: 'ప్రాశితం దది యద్యగ్రే (యత్‌+అగ్రే=యదగ్రే); యత్‌-యస్మాత్‌-ఏ హేతువువలన; అగ్రే-మొదటగా; దధి-పెరుగు; ప్రాశితమ్‌-ప్రాశనము చేయబడినదో (ఆ హేతువువలన); ఇంతేకాని యది-ఆయినచో-అను నర్థమునకు ఇచట ప్రసక్తి లేదు.

48 అ. 92 శ్లో. 'క్షయమ్‌' ఇది 'స్థానమ్‌' అను అర్థములో నున్నది. ఇది అమరకోశమున చెప్పబడిన యర్థమే కాని ఈ పదమునకు ఈ యర్థమున లోక సంస్కృతమున ప్రయోగములు తక్కువ.

49 అ. శ్లో|| 'రేతోధా స్త్రాయతే పుత్త్రం పరేతం చ యమక్షయాత్‌.'

ఇచట 'రేతోధాః' అను ప్రథమావిభ##క్త్యేక వచనరూపము 'రేతోధసం- అను ద్వితీయావిభ##క్త్యేక వచన రూపపు అర్థమున వాడబడినది.

49 అ. 31 శ్లో. 'తుష్టుపుః' ఆను పరసై#్మపదరూపము 'తష్టువిరే' అను ఆత్మనేపది కర్మణ్యర్థక రూపపు అర్థములో వాడబడినది.

50 అ; 40 శ్లో. అపధ్యాతః-అసహించుకొనబడినవాడు.

51 అధ్యాయమున విచారణీయాంశములు అనేకములు గలవు:

1. 'బ్రహ్మోదనాగ్నిః' అనునది ఎంతగా శాస్త్రీయమో 'బ్రహ్మోదరాగ్నిః' అను రూపముకూడ అంతగా ప్రామాణికమే యని తోచును.

'బ్రహణ్మ ఉదరణమసి-బ్రహ్మణ ఉదీరణమసి.'

అని యజురారణ్యక శ్రుతి; ఉదరణ-ఉదీరణ-శబ్దములు-వాక్కు-పలుకు-అను అర్థమును చెప్పును. వైద్యుతాగ్ని వెలువడు నపుడు దానితోపాటు ధ్వనియును ఉత్పన్నమగును. ఆది బ్రహ్మ (ప్రజాపతి) నోటినుండి వెలువడు ఉదరణము (ఉదీరణము); వ్యుత్పత్తి ననుసరించి ఉదరశబ్దము కూడ ఈ రెండు శబ్ధములతో సమానార్థకమే యగును.

2. ఈ అధ్యాయమున ప్రతిపాదింపబడిన అగ్నులు మొత్తము నలువది తొమ్మిది మంది; ఇందు 1- పావక 2. పవమాన 3. శుచులు 4. వైద్యుత 5. నిర్మథ్య 6. సౌరులు 7. సహరక్షః 8. కవ్యవాహ 9. హవ్యవాహులు-అను తొమ్మిదిమందియు మొదటిదశలోని వారు. రెండవదశలో పావకునకు 10. భరత 11. వైశ్వానరులు; పవమానునకు 12. 13. సభ్యావనథ్యులు; శుచికి 14-29. పదునారుమంది ధిష్ణాగ్నులు జనించిరి; ఇక మూడవదశలో పావకునకు 30-35. ఆరుమందియు శుచ్యగ్నికి 36-49 పదునాలుగుమందియు జనించిరి. ఇట్లు వీరు మొత్తము నలువది తొమ్మిదిమంది.

కాని 'Matsya Purana-A Study' (By Agarwal)లో శుచికి 30-35 పావకునకు 36-41 పవమానునకు 42-49 అని యున్నది. ఇది మూలమునకు విరుద్ధమని తోచును. దీని నిర్ణయము శ్రౌత సంప్రదాయమును సమగ్రముగ నెరిగిన పెద్దలు చేయదగినది.

3. అభిమానినీ దేవతా; (స్త్రీలింగమున); అభిమాని దైవతమ్‌ (నపుంసకలింగము); అభిమానీ దేవః (పుంలింగమున) ఈ ప్రయోగమునకు రెండు విధములగు వ్యుత్పత్తులను-వానిని బట్టి అర్థములను-చెప్పవచ్చును. రెండును ప్రామాణికములేయని తద్‌జ్ఞులు సమ్మతించినారు. 1. అయం పదార్థో మత ంబంధీ-అయం పదార్థో మమ అధిష్ఠానం ఆధారః-ఆశ్రయో వా; అహం ఇమం పదార్థం ఆశ్రిత్య వర్తమానా సతీ- ఉపాసకానాం తత్తత్ఫలాని దదామీతి యా దేవతా అభితః మనుతే సా తత్పదార్థాభిమానినీ దేవతా ఇత్యేకం నిర్వచనమ్‌. 2. అస్మిన్‌ పదార్థే ఇయం దేవతా అభిగతా-వ్యాప్య స్థితా-ఇయం ఆరాధితా సతీ-ఉపాసకానాం తత్తత్ఫలాని దదాతి-ఇతి యా దేవతా తత్త్వజ్ఞైః మన్యతే-సా తదభిమానినీ దేవతా ఇతి అన్యత్‌ నిర్వచనమ్‌; ఈ నిర్వచనముల యర్థము. 1. ఈ పదార్థము నాకు సంబంధించినది; ఈ పదార్థము నాకు అధిష్ఠానము (ఆధారము-ఆశ్రయము); నేను ఈ పదార్థమును ఆశ్రయించుకొనియుండి ఉపాసకులకు ఆయా ఫలములను ఇత్తును; అని ఏ దేవత ఆయా జడ చేతన పదార్థముల విషయమున సమగ్రముగ తలచునో ఆ దేవత ఆ పదార్థమునకు అభిమానిని యగు దేవత; 2. ఈ పదార్థమునందు అంతటను ఈ దేవత వ్యాపించియున్నది; ఈమె ఆరాధింపబడినది యగుచు ఉపాసకులకు ఆయా ఫలములను ఇచ్చును; అని తత్త్వజ్ఞులచే తలచబడు దేవత తత్పదార్థాభిమానిని యగు దేవత.

4. దిష్ణ్య శబ్దార్థము. 'ధిష్ణ్యమ్‌-ప్రాణాభిమానీ దేవః;'

ఋక్‌ : ''అగ్నే దివో అర్ణ ముచ్ఛా జిగా-

స్యచ్ఛా దేవీ ఊచిషే ధిష్ణ్యా (ష్ణియా) యే|

యా రోచనే పరస్తాత్‌ సూర్యస్య

యా శ్చావస్తా దుపతిష్ఠంత ఆపః.''

(ఋగ్వేద 3-22-3)

''ధియం బుద్ధ్యుపహితం దేహం ఉష్ణంతి-ఉష్ణీ

కుర్వంతి- ఇతి- ధిష్ట్యాః- ప్రాణాభిమానినో

దేవాః. ఇతి తద్భాష్యే సాయనః''.

5. పంచాగ్నయః 1. గార్హపత్యః 2. ఆహవనీయః 3. దక్షిణాగ్నిః 4. సభ్యః 5. ఆవసథ్యః ఇతి;

1. గార్హపత్యః: గృహపతినా సంయుక్తో7గ్నిః గార్హపత్యః; యో7గ్ని ర్యజమానేన తత్పితృ పితామహాదిక్రమేణ కులధనతయా లబ్ధో దాయరూపేణ- సో7సౌ గార్హపత్యః 2. ఆహవనీయ స్త్వతిథీనా మగ్నిః; ఆహూయతే7స్మి న్నతిథిభి రితి; 3. దక్షిణాగ్నిః:

3. అసై#్యవ లౌకికాగ్నిరి త్యపి వ్యవహారః; అయమగ్ని ః ప్రాయశ్చిత్తాభిచారిక శాంతికపౌష్టికాదిషు వినియుజ్యతే; అసై#్యవాన్వాహార్యపచన ఇత్యపి వ్యవహారః; అన్వాహార్యం నామ మాసిక శ్రాద్ధ విశేషః; ఇత్యమరః; తదర్థం పాకో7స్మిన్‌ క్రియతే ఇత్యన్వాహార్యపచనః.

అత్ర విషయే ఆపస్తంబః: ఆపస్తంబ ధర్మ సూత్రమ్‌ (2-7-2); యో7తిథీనామగ్నిః స ఆహవనీయో- యః కుటుంబే న గార్హ పత్యో-యస్మిన్‌ పచ్యతే సో7న్వాహార్యపచనః- ఇతి.

అస్య హరదత్త వృత్తిః యో7తిథీనాం జాఠరో7గ్నిః- స అహవనీయః;తత్ర హి హూయతే; యః కుటుంబే-గృహే7గ్నిరౌపాసనః- స గార్హపత్యః- నిత్య ధార్యత్వాత్‌; యస్మిన్పచ్యతే లౌకికాగ్నౌ సో7న్వాహార్యపచనః దక్షిణా7గ్నిః; తత్ర హ్యన్వాహార్యం వచ్యతేః అన్వాహార్యంనామ - దర్శపూర్ణమా సేష్టౌ ఋత్విజాం దక్షీణాత్వేన యద్ధేయ మన్నం తత్‌; ఇతి.

గార్హపత్యాగ్నిరేవ యదా కుండాంతరే ఆనీయ సంస్ర్కియతే సంస్కారవిశేషేణ- తదా తస్య దక్షిణాగ్నిరితి సంజ్ఞా; తదర్థ మానయనదశాయాం తస్య 'ఆనాయ్య' ఇతి వ్యవహారః.

శాంతిరత్నే కమలాకరభట్టః:

స్మార్తగ్నే ర్ద్వైవిధ్యమ్‌: స్మృతిప్రోక్త కర్మానుష్ఠానేషు వినియుజ్యమానో7గ్నిః స్మార్తాగ్నిః; స ద్వివిధః: ''స్మార్తాగ్ని ర్ద్వివిధో జ్ఞేయో గృహ్యః పౌరుష ఇత్యపి| యస్మి న్వివాహం కురుతే సో7గ్ని ర్గృహ్య ఇతి స్మృతః. జాతకర్మాది సిద్ధ్యర్థం యో వ్యాహృతిభి రాహృతః| సో7గ్నిః పౌరుష ఇత్యుక్తః శాలాగ్ని ర్లౌకిక స్తథా.'' ఇతి.

ఆహితాగ్నిః: ఆహితాగ్నిర్నామ సః- యేనాధానేన శ్రౌతకర్మ సంపాదనార్థం నిష్పాదితః; స చ మూలతః త్రిధా: గార్హ పత్యః- ఆహవనీయః- దక్షిణాగ్ని శ్చేతి; తేషాం వినియోగః: గార్హపత్యే హవీంషి శ్రపయతి- ఆహవనీయే జుహోతి-దక్షిణాగ్ని వన్వాహార్యం పచతి; ఏతేషామేవ 'వైతానికాగ్నయః' ఇతి శాస్త్రేషు వ్యవహారః.

ఆహితాగ్న్యనాహితాగ్ని క్రియమాణ కర్మణోః భేదః: పుత్త్రేష్టిః- పుత్త్రజననోత్తరం ఆహితాగ్నినా క్రియమాణా ఇష్టిః; తేనైవాహితాగ్నినా 'పుత్త్రో మే భూయా ది'తి కామనయా క్రియమాణా ఇష్టిః పుత్త్రకామేష్టిః! యా ఆహితాగ్నేః పుత్త్రేష్టిః- సైవ అనాహితాగ్నేః జాతకర్మ.

చరు-పురోడాశయోర్‌ భేదః:

ఏవమేవ య ఆహితాగ్నేః హవనే కర్మణి వినియోగార్థం పురోడాశః- స ఏవ అనాహితాగ్నేః చరుః స్మార్తేషు కర్మసు వినియోగార్థమ్‌

షోడశర్త్విజః (పదునారుమంది ఋత్విజులు)

శ్రీమత్స్యమహాపురాణమున పదునారుమంది ఋత్విజులును ఇట్లు పేర్కొనబడినారు: (అధ్యా-166)

7. బ్రహ్మాణం ప్రథమం వక్త్రత్‌| ఉద్గాతారం చ సామగమ్‌|

హోతార మపి చాధ్వర్వుం| బాహుభ్యా మసృజ త్ర్పభుః.

8. బ్రహ్మణో బ్రాహ్మణాచ్ఛంసిం| ప్రస్తోతారం చ సర్వశః|

తౌ మైత్రావరుణం పృష్ఠాత్‌| ప్రతిప్రస్థాతార మేవ చ.

9. ఉదరా త్ర్పతిహర్తారం| పోతారం చైవ పార్థివ|

అచ్ఛావాక మథోరుభ్యాం నేష్టారం చైవ పార్థివ!

10. పాణిభ్యా మథ చాగ్నీధ్రం| సుబ్రహ్మణ్యం తు జానుతః|

గ్రావస్తుతం తు పాదాభ్యాం| ఉన్నేతారం చ యాజుషమ్‌.

11. ఏవమేవైష భగవాన్‌ షోడశైవ జగత్పతిః|

ప్రవర్తౄన్‌ సర్వయజ్ఞానాం| ఋత్విజో7సృజ దుత్తమాన్‌.

తా. భగవానుడగు జగత్పతి ప్రజాపతిరూపుడై ఆ ప్రజాపతికి గల ఆయా అవయవములనుండి సర్వయజ్ఞ ప్రవృత్తి హేతుభూతులగు పదునారుమంది ఋత్విజులను జనింపజేసెను. ఎట్లన-వక్త్రమునుండి 1. బ్రహ్మను 2. ఉద్గాతను-బాహువులనుండి 3. హోతను 4. అధ్వర్యుని-బ్రహ్మ (హృదయము) నుండి 5. బ్రాహ్మణాచ్ఛంసిని 6. ప్రస్తోతను-పృష్ఠమునుండి 7. మైత్రావరుణుని 8. ప్రతిప్రస్థాతను-ఉదరమునుండి 9. పోతను 10. ప్రతిహర్తను- ఊరువులనుండి 11. అచ్ఛావాకుని 12. నేష్టను-పాణుల (కరముల) నుండి 13. ఆగ్నీధ్రుని-జానువులనుండి 14. సుబ్రహ్మణ్యుని-పాదముల నుండి 15. గ్రావస్తు(త్‌)తుని 19. ఉన్నేతను- సృజించెను.

శ్రీమత్స్య మహాపురాణమున 166 వ అధ్యాయమున చెప్పబడిన పదునారుమంది ఋత్విజులలో బ్రహ్మ-ఉద్గాత-హోత-ఆధ్వర్యుడు-అను నలుగురును ముఖ్యులు; బ్రహ్మకు బ్రాహ్మణాచ్ఛంసి-పోత-ఆగ్నీధ్రుడు అనువారును ఉద్గాతకు ప్రస్తోత-ప్రతిహర్తా - సుబ్రహ్మణ్యుడు అనువారును హోతకు మైత్రావరుణాచ్ఛావాక గ్రావస్తుతులను అధ్వర్యునకు ప్రతి ప్రస్థాత-నేష్ట-ఉన్నేత-అనువారును యజ్ఞ నిర్వహణమునందు సహాయులు; (చూ. ఆశ్వలాయన శ్రౌతసూత్రములు-పూర్వ షట్క 4 అధ్యాయారంభము); ఇందు మొట్టమొదట స్నాతకుడు (గురుకులమున వేద విద్యాధ్యయనము ముగించి తత్సమాప్తి వ్రత స్నానమును ఒనరించుకొనిన బ్రమ్మచారి) కాని-బ్రహ్మచిరి (గురుకులమున ఇంకను వేద విద్యాభ్యాసము చేయుచున్న వాడు) కాని విద్యాధ్యయనము ముగించి ఉపకుర్వాణ బ్రహ్మచారిగా నున్న యాతడు కాని మరెవ్వరైనను దీక్షితుడు (దీక్షాగ్రహణ పూర్వకముగా యజ్ఞములు ఒనరించియుండిన గృహస్థుడు) కాని 'ఉన్నేత'ను దీక్షితునిగా చేయును; ఉన్నేత-అధ్వర్యునకై నేష్టను బ్రహ్మకై ఆగ్నీధ్రుని ఉద్గాతకై సుబ్రహ్మణ్యుని హోతకై గ్రావస్తుత్‌ను దీక్షితులనుగా చేయును. నేష్ట-అధ్వర్యునకై ప్రతిప్రస్థాతను బ్రహ్మకై పోతను ఉద్గాతకై ప్రతిహర్తను హోతకై అచ్ఛావాకుని దీక్షితులనుగా చేయును; వ్రతిప్రస్థాత-అధ్వర్యుని-బ్రహ్మకై బ్రాహ్మణాచ్ఛంసిని ఉద్గాతకై ప్రస్తోతను హోతకై మైత్రావరుణుని దీక్షితులనుగా చేయును; అధ్వర్యుడు గృహపతిని బ్రహ్మను ఉద్గాతను హోతను దీక్షితులనుగా చేయును. (శతపథ బ్రాహ్మణము-మధ్యమకాండము-ప్రథమాధ్యాయము-ప్రథమ బ్రాహ్మణము.)

శ్రీమత్స్య మహాపురాణమున యజ్ఞాత్మక బ్రహ్మదేహావయవములుగా పేర్కొనిన ఋత్విజుల క్రమమును చివరి నుండి ('ఉన్నేత'నుండి) చూచినచో ఈ క్రమములోని ఉచితత్వము అవగతము అగును.

విశేషము: శతపథ బ్రాహ్మణమును మత్స్య పురాణోక్త యజ్ఞ బ్రహ్మావయవభూత ఋత్విక్సంస్థానమును అనుసరించి బ్రహ్మకు సహాయులు బ్రాహ్మణాచ్ఛంసి పోత్రాగ్నీధ్రులు కాగా ఆశ్వలాయన శ్రౌతసూత్రములలో బ్రాహ్మణాచ్ఛం స్యాగ్నీధ్రపోతలు అనియున్నది. మిగిలినదంతయు అన్నిట సమానమే.

ఋగ్వేదమును (చూ. ఈ మత్స్య. పుట. 219) ఋక్కులో పేర్కొనబడిన ఋత్విజులు: !. హోతా 2. పోతా 3. నేష్టా 4. ప్రశాస్తా 5. అధ్వర్యుః 6. బ్రహ్మా 7. గృహపతిః 8. ఆగ్నీధ్రః 9. ఆత్రేయః.

ఆశ్వలాయన శ్రౌతసూత్రములయందు (ఉత్తర షట్కము. 6వ అధ్యాయము-9వ ఖండము) యజ్ఞ ప్రవర్తకులుగా ఇరువది ఇద్దరు పేర్కొనబడినారు. 1. ప్రస్తోతా 2. ఉద్గాతా 3. ప్రతిహర్తా 4. హోతా 5. బ్రహ్మా 6.మైత్రావరుణః 7. బ్రాహ్మణాచ్ఛంసీ 8. అధ్వర్యుః 9. ఉపగాతా 10. ప్రతిప్రస్థాతా 11. నేష్టా 12. పోతా 13. అచ్ఛావాకః 14. ఆగ్నీధ్రః 15. ఆత్రేయః 16. సదస్యః 17. గృహపతిః 18. గ్రావస్తుత్‌ 19. వైకర్తః 20. ఉన్నేతా 21. శమితా 22. సుబ్రహ్మణ్యః.

శ్రీమత్స్య మహా పురాణమున 166వ అధ్యాయములో గ్రహింపబడక ఆశ్వలాయున శ్రౌతసూత్రములలోగ్రహింపబడినవారు:ఉపగాతా-ఆత్రేయః-సదస్యః-గృహపతిః-వైకర్తః-శమితా.

మత్స్యపురాణపు 51వ అధ్యాయములో పేర్కొనబడినవారు: 1. బ్రహ్మా 2. గృహపతిః 3. ఆగ్నీధ్రః 4. హోతా 5. ప్రశాస్తా 6. బ్రామ్మణాచ్ఛంసీ (సిః) 7. పోతా 8. నేష్టా 9. అచ్ఛావాకః 10. మార్జారీయః; ఇందు బ్రహ్మకు సహాయులు-బ్రాహ్మణాచ్ఛంసీ-పోతా-ఆగ్నీధ్రః-అనువారు; నేష్ట-అధ్వర్యునకు సహాయుడు; అచ్ఛావాకుడు-హోతకు సహాయుడు.

ఈ యజ్ఞ ప్రవర్తకులు నిర్వహించు యజ్ఞియ ప్రక్రియాంశములు సంప్రదాయమున తెలిసికొనవలయును.

ప్రజాపతి శబ్దార్థము.

లోక వ్యవహార వ్యవస్థలోని యంశములును లోక వ్యవహార వ్యవస్థా ప్రవర్తకులును మన ప్రాచీన వాఙ్మయమున ప్రజావతి శబ్దముచే గ్రహింపబడినట్లు తెలియుచున్నది. సంవత్సరః వ్రజాపతిః-యజ్ఞః ప్రజాపతిః-మరీచ్యాదయః ప్రజాపతయః- చతుర్దశమనవః ప్రజాపతయః ఇత్యాదికము.

ప్రజలు అనగా ప్రాణులు అన్ని యును; వాని జీవన ప్రవృత్తులను వ్యవస్థితము చేయు తత్త్వములు అన్నియు-అవి మూర్తములు ఐనను- అమూర్తములు ఐనను- చేతనములు అయినను- కాకున్నను ప్రజాపతులే. ఏలయన వీరు ప్రజా (జీవన) ప్రవృత్తిని రక్షింతురు.

త్రింశత్‌ (ముప్పది) సంస్కారములు-పాఠపరిష్కారము.

శ్రీమత్ప్యమహాపురాణపు ఏబది రెండవ అధ్యాయము క్రియాయోగవిధిని తెలుపును. మానవుడు సత్కర్మాను ష్ఠానముచే చిత్తశుద్ధిని జ్ఞానమును పొందవలయును. తద్ద్వారమున ము క్తినందవలయును. అని ఇందు చెప్పబడినది. ఇచట ప్రాసంగికముగా మానవుని శిష్టునిగా చేయుటకు ఉపకరించు సంస్కారములు ముప్పదియని చెప్పబడినది. అవి ఏవి? అనునది ఇట స్పష్టముగా లేదు.

భవిష్య మమాపురాణమున బ్రాహ్మ పర్వమున ద్వితీయాధ్యాయమున చత్వారింశత్సంస్కారములు పేర్కొనబడినవి. అవి వరుసగా ఇవి: 1. గర్భాధానము. (ఈ సంస్కారము దంపతులకు పుట్టబోవు కుమారుడు శిష్టుడు కావలెనను సంకల్పముతో చేయునది కావున ఇది కుమారునకు అన్వయించునేకాని దంపతులకు కాదు.) 2. పుం-సవనము (పుట్టబోవు-పుం-పురుష-సంతానము ఉత్తముడు కావలెనని జరుపు- సవనము-దేవతారాధనము) 3. సీమంతోన్న యనము 4. జాతకర్మము 5. అన్నప్రాశనము 6. చూడా కర్మము 7. ఉపనయనము 8-9-10-11. నాలుగు బ్రహ్మవ్రతములు 12. స్నానవ్రతము 13. సహధర్మచారిణిని కూడుట (వివాహము) 14-15-16-17-18 దేవపితృ మనుష్యభూత బ్రహ్మ యజ్ఞములు అనెడు పంచయజ్ఞములు 19. అష్టకా కర్మము 20. పార్వణశ్రాద్ధము 21. శ్రావణీ 22. ఆగ్రహాయణీ 23. చైత్రీ 24. ఆశ్వయుజీ 25-31 సప్తపాక యజ్ఞములు 32. అగ్న్యాధానము-దానికి సంబంధించిన సత్ర్కియలును 33. అగ్నిహోత్రము 34. దర్శపౌర్ణమాసములు 35. చాతుర్మాస్యములు 36. నిరూపణము 37. పశుబంధము 38. సౌత్రామణి 39. సప్తహవిర్యజ్ఞములు-వాటిసత్ర్కియలు40.అగ్నిష్టోమము-అత్యగ్నిష్టోమము-ఉక్థ్యము-షోడశీ-వాజ పేయము-అతిరాత్రము-ఆప్తోర్యామము-అను సప్త సోమసంస్థలు; ఇవి నలువది.

కాని మత్స్యపురాణమున మూలమున ఈ సందర్భములో:

''ద్వివింశతి తథా చాష్టౌ యే సంస్కారాః ప్రకీర్తితాః.''

అని ఇంచుమించుగా ఇదే రూపముతో చాల ప్రతులలో కనబడుచున్నది. ద్వివింశతి-22+అష్టౌ-8=30.

కాని పై భవిష్య పురాణ ప్రమాణమును బట్టి ఇచట 'ద్విత్రింశతి'- అని యుండదగును. అపుడు 32+8=40 యగును.

ఇచట 'ద్వివింశతి' లేదా 'ద్విత్రింశతి' ఆర్ష (శిష్ట) రూపము.

54 అ. 9 శ్లో. 'సితపక్షే చ విధితః సోమో మూలేన సంయుతః.' అని మూల ప్రతులయందలి పాఠము; ఈ 'సిత' (శుక్ల) పక్షము చైత్రమాసమునందు రావలయును. 'చిత్ర నక్షత్రేణ యుక్తా పౌర్ణమాసీ అస్మిన్‌ మాసే ఇతి చైత్రః'. 'చిత్రా నక్షత్రముతో చంద్రుడు కూడియుండు పూర్ణిమాతిథి ఈ మాసమునందు ఉండును. కావున ఇది చైత్ర మాసము.' ఒక నక్షత్రము ఎక్కువ తక్కుప అయినను చైత్రమున బహుళ పక్షముననే తప్ప శుక్ల పక్షమున మూల నక్షత్రము రాదు. కావున ఇచట 'సితి పక్షే' (కృష్ణపక్షమున) అని ఉండవలయును. పఠితలు 'సిత పక్షే' అని కాక 'సితిపక్షే' అని చదువుకొందురుగాక !

66 అ. సరస్వతీ మూర్త్యష్టకము :

లక్ష్మీ-ర్మేధా- పరా- పుష్టి- ర్గౌరీ- తుష్టిః- ప్రభా-మతిః|

ఏతాభిః పాహి చాష్టాభి స్తనుభి ర్మాం సరస్వతి!

సరస్వతిని ఈ రూపములలో భావన చేయుట నకలార్థ సిద్ది ప్రదము.

72 అ. 17 శ్లో. ప్రక్షిస్య-వి స్తరించి; దీనికి విలోమముగా-సంక్షిప్య-సంకోచించి-తగ్గించి.

74. అ. శ్లో. బైడాలవ్రతమ్‌:

యస్య ధర్మధ్వజో నిత్యం శక్రధ్వజ ఇవోచ్ఛ్రతః|

ప్రచ్ఛన్నాని చ పాపాని బైడాలం నామ తద్ర్వతమ్‌.

ఈ శ్లోకము వంచకుల స్వరూపమును స్పష్టము సేయుచున్నది.

92. అ. 86-87 శ్లో

యత్నః-యోగ్యతా; శక్తిః- అను అర్థమున:

యస్తు పీడాకరో నిత్య మల్పవిత్తస్య వా గ్రహః|

తం చ యత్నేన సంపూజ్య శేషాన ప్యర్చయే ద్గ్రహాన్‌.

92 అ. 87-88. ధర్మ తత్త్వము :

గ్రహా గావో నరేంద్రాశ్చ| బ్రాహ్మణాశ్చ విశేషతః|

పూజితాః పూజయం త్యేతే| నిర్దహం త్యవమానితాః.

98 అ. 59 శ్లో. ఈ శ్లోకమున 'సా స్యా త్ర్పీతిరితి శ్రుతా.' అనియున్నది. కాని ఇది ప్రకృతార్థమున సరిపోవలయు ననిన- 'సా స్యా త్ర్పీతీ రతేః స్మృతా.' అని యుండవలెను. పఠితలు ఈ పాఠమునే గ్రహింతురుగాక!

111 అ. మొదలు 122 అ. వరకు గల భువనకోశాధ్యాయములందలి భూగోళ సంస్థానమున :

120 అ. శ్లో. 'మోదతే'- అను మోదతే- అనుభవించి మోదించును-అను నర్థమున;

అప్సరో7నుగతో రాజా| మోదతే హ్యలకాధిపః|

కైలాసపాద సంభూతం పుణ్యం శీతజలం శుభమ్‌.

ఇచట 'అలకాధిపః శీతజలం మోదతే' అని అన్వయము; ఇచట జలమునకు కర్మత్వము; 'మోదతే' అకర్మక క్రియ యైనను పైయర్థమున సకర్మక క్రియగా గ్రహించవలెను.

122వ అ. 13 శ్లో. ఛందో విశేషము :

ద్వీపేన పుష్కరేణాసౌ| వృత శ్చేక్షురసోదక-|

సముద్రేణ మహాభాగో| గోమేద ద్విగుణన తు.

ఈ శ్లోకమున పూర్వార్ధము అంతటితో తెగిపోక ఉత్తరార్దముతో అదుకుపడియున్నది.

ద్వీప-సముద్ర-క్రమము:

1 జంబూద్వీపము-క్షారసముద్రము 2. శాకద్వీపము-క్షీర సముద్రము 3. కుశద్వీపము-సురా సముద్రము 4. క్రౌంచద్వీపము-ఘృత సముద్రము 5. శాల్మల ద్వీపము-దధి సముద్రము 6. గోమేద ద్వీపము-స్వాదూదక సముద్రము 7. పుష్కర ద్వీపము-ఇక్షురస సముద్రము.

బ్రహ్మాండ పురాణము-శ్రీమద్భాగవతము-భూగోళ వ్యవస్థ.

బ్రహ్మాండ పురాణమున అనుషంగ పాదపు పంచదశాధ్యాయాదికమును శ్రీమద్భాగవత పంచమ స్కంధమున 18-19-20 అధ్యాయములను ఇందులకై చూడవచ్చును.

ఆర్యవర్తము : పతంజలి మహాముని వ్యాకరణ మహాభాష్యమున అర్యావర్తపు అవధులను ఇట్లు తెల్పిరి :

''కః పున రార్యావర్తః? ప్రాగాదర్శత్‌- ప్రత్య క్కాలకవనాత్‌-

దక్షిణన హిమవంతమ్‌- ఉత్తరేణ పారియాత్రమ్‌.''

బ్రహ్మావర్తము :

''సరస్వతీ దృషద్వత్యో ర్దేవనద్యో ర్యదంతరమ్‌|

తం దేవనిర్మితం దేశం బ్రహ్మావర్తం విదు ర్బుధాః.'' ఇతి మనుః.

అపరాంతము :

అపరాంతాస్తు పాశ్చాత్త్యా స్తే చ సూర్యరికాదయః-ఇతి

యాదవః (కోశః); అపర-అంత-స్థ=పడమటి అవధియందుండువారు.

మధ్య దేశము :

హిమవద్వింధ్యయో ర్మధ్యం| యత్‌ ప్రా గ్వినశనాదపి| ప్రత్యగేవ ప్రయాగాచ్చ మధ్యదేశః ప్రకీర్తితః. ఇతి మనుః (2-21) వినశనమ్‌- కురుక్షేత్రమ్‌; మధ్యదేశస్తు మధ్యమః; ఇత్యమరః.

ఆర్యావర్తము (మనుః) :

ఆసముద్రాత్తు వై పూర్వా దాసముద్రాత్తు పశ్చిమాత్‌|

తయోరేవాంతరం (హిమవద్వింధ్యయోర్‌) గిర్యో-

రార్యా వర్తం విదు ర్బుధాః' (2-22).

ఆర్యావర్తః పుణ్యభూమి ర్మధ్యం వింధ్య హిమాగయోః. ఇత్యమరః.

ప్రాచ్యదేశము-ఉదీచ్య దేశము: శరావత్యాస్తు యో7వధేః|

దేశః ప్రాగ్దక్షిణః ప్రాచ్య ఉదీచ్యః పశ్చిమోత్తరః. ఇత్యమరః (ద్వి.కాం-భూవర్గము);

ఈ విషయమున పరంపరాగతమగు శ్లోకము ఇట్లున్నది:

'ప్రాగుదంచౌ విభజతే హంసః క్షీరోదకం యథా|

విదుషాం శబ్దసిద్ధ్యర్థ్యం సా నః పాతు శరావతీ.' ఇతి.

ప్రత్యంతము-ప్రతిగతః అంతం- (ఆశ్రితః- ప్రతిగతః- ఇతి పర్యా¸°) ఇతి ప్రత్యంతం; 'ప్రత్యంతో వ్లుెచ్ఛదేశః స్యాత్‌' ఇత్యమరః; శిష్టాచారరహితఖశాది దేశస్య నామ-ఇత్యమర సుధావ్యాఖ్యా.

''చాతుర్వర్ణ్వవ్యవస్థానం యస్మిన్‌ దేశే న విద్యతే|

తం వ్లుెచ్ఛవిషయం ప్రాహు; రార్యావర్త మతః పరమ్‌.''

ఇతి పరంపరాగతః శ్లోకః.

వేదాది సంప్రదాయానుగత శిష్టాచార సహితాః

ఆర్యాః; ఆర్యా సై#్త్రవర్ణికాః ఇతి హరదత్తః.

వస్తుతస్తు వ్లుెచ్ఛశబ్దో వ్లిుష్టశ##బ్దేన సంబద్ధః; అస్పష్టా7సంస్కృత శబ్దఘటిత భాషావ్యవహర్తృ జనవాచీ; నవ్లుెచ్ఛితవై - నాపభాషితవై - ఇతి పాతంజలే భాష్యే.

వర్షము-భారతవర్షము.

వర్షము అనగా స్థానము :

వర్షం స్థానం విదుః ప్రాజ్ఞాః; ఇమం లోకం చ భారతమ్‌|

ఉత్తరం య త్సముద్రస్య| హిమాద్రే శ్చైవ దక్షిణమ్‌. ఇతి భారవిః.

మత్స్యే తు-వర్షం త ద్భారతం నామ| భారతీ యత్ర సంతతిః ఇతి.

ముకుటే తు-అత ఏవ సామాన్య విశేషభావాత్‌ జంబూద్వీపే- తదేకదేశే చ 'భారత' ప్రయోగః; ప్రకరణాదిభిస్తు తదవగమః. యథా- 'ఏత దూఢగురుభార! భారతం వర్ష మద్య మమ వర్తతే వశే.' ఇతి మాఘః. (14 సర్గ; 5శ్లో.) తథా-ఏతేనభారత మిలావృతవ ద్విభాతి.' ఇతి చ. (4సర్గ; 31శ్లో.)

అన్యాన్యపి వర్షాణి-యథా:

''స్యా ద్భారతం కింపురుషం| హరి-వర్షం చ దక్షిణాః|

రమ్యం హిరణ్మయకురూ| సుమేరో రుత్తరా స్త్రయః.

భద్రాశ్వకేతుమాలౌ తు| ద్వౌ వర్షౌ పూర్వపశ్చిమౌ|

ఇలావృతం తు మధ్యస్థం| స (సు)మేరు ర్యత్ర తిష్ఠతి. ఇతి వాచస్పతిః.

పై వానిలోని సంస్ర్కత వచనములకు తెలుగు:

''ఆర్యావర్తనమనగా ఏది మరి? 'ఆదర్శ' (మనుప్రదేశ) మునకు తూర్పున - కాలకవనమునకుపడమటగా-హిమవంతమునకు దక్షిణమున- పారియాత్రపర్వతమునకు ఉత్తరమున-ఉండునది! అని పతంజలి భాష్యవచనము.

సరస్వతీ-దృషద్వతులు అను దేవ (వేదములాదిగా ప్రాచీన వాజ్మయమున పేర్కొనబడి ఈనాడు అంతర్వాహినులయియున్న) నదుల నడుమ నున్నదియు దేవతలచే (వేదాది వాజ్మయమున) నిర్మితమును అగు దేశమునే బ్రహ్మావర్తము అని తెలిసినవారు తలచుచున్నారు. అని మను వచనము.

'సూర్యరికులు' మొదలగు భారతదేశపు పడమటి అంచులలో ఉండువారు అపరాంత జనులు-అని యాదవ కోశవచనము.

హిమాలయమునకు దక్షిణమున వింధ్యమునకు ఉత్తరమున కురక్షేత్రము (వినశనము) నకు తూర్పున ప్రయాగకు పడమట ఉండు దేశమునకు మధ్యదేశము అని వ్యవహారము.

హిమవద్వింధ్యములకును ప్రాక్పశ్చిమ సముద్రములకును నడుమనుండు దేశము ఆర్యావర్తము అనిమను వచనము.

హిమవద్వింధ్యములకు నడుమనుండు పుణ్యభూమికి 'ఆర్యావర్తము' అని వ్యవహారము అని అమరవచనము.

('శరావతీనది' బ హుశః ఈశాన్య నైరృత దిశలుగా ప్రవహించునది కావచ్చును); కనుక ఈ శరావతికి ప్రాగ్దక్షిణమున (ఆగ్నేయమున) ఉండు దేశము 'ప్రాచ్యము' అనియు ఈనదికి పశ్చిమోత్తరమున (వాయవ్యమున) ఉండు దేశము ఉదీచ్యము అనియు వ్యవహరింపబడును. అని అమరవచనము.

పాణినీయ వ్యాకరణ సూత్రములందు ప్రాచ్యోదీచ్య-దేశములు పేర్కొనబడినవి; తద్‌ దేశీయులగు వైయాకరణులును పేర్కొనబడినారు; ఈ 'ప్రాచ్యోదీచ్య' దేశ వ్యవస్థకు శరావతీ నదియే అవధి; కావున 'హంస తాను తన యోగ్యతచే క్షీర నీర మిశ్రమును వివేచించి క్షీరమును నీరమును వేరుపరచునట్లు ప్రాచ్యోదీచ్య దేశములను (వ్యాకరణ) విద్యాంసుల శబ్దరూప సిద్దకై వేరుపరచు శరావతీనది మమ్ములను రక్షించుగాక!' అని ఈ శ్లోకమునకు అర్ధము.

అంతము (అంచు)ను ఆశ్రయించి (ప్రతిగతమయి) ఉండునది 'ప్రత్యంతము.' ప్రత్యంతము అనగా భారత దేశపు అంచులయందలి వ్లుెచ్చ దేశము అని అమరసింహ వచనము; శిష్టాచార రహితమగు 'ఖశులు' మొదలగు జనులు నివసించు దేశము-అని అమరకోశ సుధా వ్యాఖ్యా వివరణము.

''ఏదేశమునందు చాతుర్వర్ణ్యవ్యవస్థ యుండదో అట్టి ప్రదేశమును వ్లుెచ్చ దేశము అందురు; ఇట్టిది కాని శిష్టజనాశ్రయ దేశము ఆర్యావర్తము.'' అని పరంవరాగతశ్లోకార్థము.

వేదాది సంప్రదాయమును అనుసరించియుండు శిష్టాచారముతో వ్యవహరించువారు ఆర్యులు; 'ఆర్యులు అనగా త్రైవర్ణికులు' అని అప స్తంబ ధర్మసూత్ర వ్యాఖ్యలో హరదత్తుల వచనము.

వాస్తవమున వ్లుెచ్చ శబ్దము 'వ్లిుష్ట' శబ్దముతో సంబంధముకలది; అన్పష్టములును శబ్ద సంస్కార రహితములును నగు శబ్దములతో ఘటితములగు భాషల వ్యవహరించు వారిని ఈ వ్లుెచ్చ శబ్ధము తెలుపుము; ''మేము 'వ్లుెచ్చనము' చేయకుందుముగాక! 'అపభాషణము' (సంస్కారరహిత భాషోచ్చారణము) చేయకుందుముగాక!'' అని పతంజలి భాష్యవచనము.

'వర్షము' 'స్థానము' సమానార్థకములు అని ప్రాజ్ఞులు తలంతురు; (దక్షిణ) సముద్రమునకు ఉత్తరమున హిమవంతమునకు దక్షిణముననుండు ఈలోకమంతయు 'భారత(వర్ష)ము' అని భారవివచనము.

'భారతీ' 'భరతసంబంధిని' యగు సంతతి ఎచట గలదో అది భారత వర్షము అని శ్రీ మత్స్యమహాపురాణము.

''దేశ సామాన్య వాచకముగా జంబూద్వీపమును-దేశ విశేష వాచకముగా జంబూద్వీపమునందలి ఏకదేశమును (ఒక చిన్న అంశమగు భారతదేశమును) ఈ 'భారత' శబ్ధము తెలుపును.' అని ముకుటుడు చెప్పెను.

ఇట ఇచ్చిన మాఘని ఉదాహరణములలో మొదటి దానిలో భారత వర్షము అనగా జంబూద్వీపము అనియు అనియు రెండవ దానిలోని 'భారత' శబ్ధమునకు భారత దేశము అనియు అర్థములు.

''మేరవునకు దక్షిణదిశయందు భారత కింపురుష హరివర్షములును-ఉత్తరమున రమ్యక హిరణ్యక కురువర్షములును తూర్పున భద్రాశ్వ వర్షమును పడమట కేతుమాల వర్షమును నడుమ సుమేరువునకు చేరువగా ఇలా వృతమును ఉన్నవి.''

భూగోళ విభాగ విషయమున భావనాత్రయముః

1.®µ…[aRP ¿RÁ»R½VxtísQ¸R…V „s˳ØgRiª«sVVM C „s˳ØgRiª«sVVƒ«s ª«sV¥¦¦¦ ®ªs[VLRiVª«so (Fy„dsVLRiV {mshRi˳ÏÁW„sV) ZNP[Li úµR… róy¬ds¸R…Vª«sVV; C ®µ…[aRP ¿RÁ»R½VxtísQ¸R…Vª«sVVÍÜ[ Azqs¸R…W ÅÁLi²R…ª«sVLiµR…ÖÁ ¿yÌÁ ˳ØgRiª«sVV ¿Á[Lji¸R…VVƒ«sõµj….

2. సప్తద్వీప విభాగముః ఈ విభజనమునందు యావధ్బూమండలమును చేరును.

3. నవవర్ష విభాగముః ఇది ప్రధానముగా జంబూద్వీపమునకు సంబందించినది.

మత్స్య-బ్రహ్మాండ పురాణములందు సప్తవర్ష విభాగము గ్రహింపబడినది. అవి 1. ధారతము 2. కింపురుషము 3. హరి 4. ఇలావృతము 5. రమ్యకము 6. హిరణ్యకము 7.కురు.

వీనికి ఇందలి పర్వతములను బట్టి నామములుః 1. హైమవతము 2. హైమకూటము 3.నైషధము 4. సౌమేరవము 5. నైలము 6. శ్వైతము 7. శార్జవతము.

'ఉత్తరాః కురవః' (ఉత్తర కురువులు)ః కరోతీతి కురుః-కుర్వంతీతి కురువః-అను కర్త్రవ్యుత్పత్తిచే 'కురు' శబ్ధము నిష్పన్నమగును. 'శ్రౌతస్మార్తాది కర్మల ననుష్టించువారు' అని అర్థము; ఇట్టి కర్మానుష్టాతలు తమ కర్మానుష్టాన ఫలములగు పుణ్యలోకములను అనుభవించుట ముగిసిన 'ఉత్తర' కాలమున ఈ వర్షమునందు జన్మింతురు కావున ఈ దేశ భాగమునకు ఉత్తర కురువులు అను వ్యవహారము వచ్చియుండును.

124 అ. శ్లో. 7. 'భ్రమంత మనుపరియంతి | నక్షత్రాణి తు పూర్వవత్‌.' ఛందోభంగము ఆర్షము.

ఈ అధ్యాయమునందే 'త్రిపథగ' అనగా 'ఆకాశం-అంతరిక్షమ్‌' అని యర్థము. ఊర్థ్వపథమున-(నిట్టనిలువుగా)-అథః పథమున - (క్రింది వైపునకు) - తిర్యక్‌ పథమున- (అడ్డముగా) మూడు మార్గముల వ్యాప్తి కలది.

అధ్యాయము: శిశుమార (శింశుమార) చక్ర వ్యవస్థ యజురారణ్యకమున ఇట్లున్నదిః

ధర్మో మూర్ధానం- బ్రహ్మోత్తరా హను- ర్యజ్ఞో7ధరా- విష్ణుర్‌ హృదయగ్‌ం- సంవత్సరః ప్రజనన- మశ్వినౌ పూర్వపాదా- వత్రి ర్మధ్యం- మిత్రావరుణా వపరపాదా- వగ్నిః పుచ్చస్య ప్రధమం కాండం- తత ఇంద్ర- స్తతః ప్రజాపతి- రభయం చతుర్థగ్‌ మ్‌. ఇతి.

ఖగోళ వ్యవస్థాధ్యాయము.

పంచ విభాగాః అహ్నః:

పగటి కాలపు ఐదు విభాగములుః

ప్రాతః- సంగవః- మధ్యాహ్నః- అపరాహ్ణః- సాయమ్‌- అహ్నోయే పంచదశ ముహూర్తాః- తే ఏకైకస్మిన్‌ విభాగే త్రయస్త్రయో ముహూర్తాః- సంగవ ఇతి తు ఉష ఆరంభస్యాపి సంజ్ఞా.

ఉషా నామ రా త్రిః- వ్యుషా నామ దివసః ఇతి మత్స్యే- 123 అధ్యా.

దీనికి ప్రమాణముగా రామాయణమున ప్రయోగములు కలవు.

పగటి కాలపు 30 గడియలను పదునైదు భాగములు చేయగా అగురెండేసి గడియలను 15 ముహూర్తములగును. ఇవి ఐదు భాగములుగా చేయగా అగు మూడేసి ముహూర్తములు ఒక్కొక్క భాగమగును; అవి వరుసగా 1. ప్రాతః 2. సంగవ(మ)ము 3. మధ్యాహ్నము 4. అపరాహ్ణము 5. సాయమ్‌- అనునవి.

ఇందు 'సంగవము' అనునది 'ఉషః' కాలమునకునుపేరు.

ఇదికాక 'ఉషా' అనగా రాత్రి-వ్యుషా అనగా పగలు అని మత్స్యపురాణపు 123 అధ్యాయమున కలదు.

కాశీఖండమున పేర్కొన్న సూర్యరధవేగము:

తే. గీ. రెండు వేలును నిన్నూటరెండు యోజ-

నంబు లర్థనిమేషమాత్రంబునందు

నంబరంబునc బారు తీవ్రాంశురథము

నిలిచె బహు కాల మిట్టిదే నియతిమహిమ.

కాశీ-ప్రథమా. 135 పద్య.

వచ. నిమేషార్థమాత్రంబున రెండువేలు నిన్నూట రెండు

యోజనంబు లతిక్రమించినం జూచి.

(కాశీ 3ఆ. 175వ.)

రవి మండల వ్యాసము 1 లక్ష యోజనములు:

సీ. ఆకాశమధ్యస్థ మగు భానుబింబంబు

విను లక్షయోజన విస్త్రతంబు.

కాశీ-3 ఆ. 180 ప.

పంచాగ్ని విద్య-శ్రీమత్స్య మహాపురాణము (123 అ.)

తద్వివరణమునకై

ఈ పురాణమున నక్షత్రవీథీ-పథ-(మార్గ-స్థాన) ప్రతిపాదనము-

యజ్ఞవేదికారూప నిష్పాదనము.

చాందోగ్యోపనిషత్తునందు పంచమాధ్యాయమున (3 నుండి 10 వరకు ఖండములు) పంచాగ్ని విద్యయును ఆ విద్యను ఉపాసించుటచే కలుగు ఫలమును కర్మానుష్టానమాత్ర పరాయణులు పొందు గతులును ఏ యుపాసనములును లేని జీవులు పొందు గతులును చెప్పబడినవి. అందు దేవయాన పితృయాణములును మధ్యమ యానమును చెప్పబడినవి.

ఆ విషయమే ఈ శ్రీమత్స్య మహాపురాణమునందలి ఖగోళ సంస్థానమును తెలుపు 123-124-125-126 అధ్యాయములందు ప్రతిపాదింపబడినది.

ఇందు 123వ అధ్యాయమునందలి 106 నుండి 116 వరకు గల శ్లోకములందు ప్రవృత్తి మార్గపరులయి గృహస్థులుగ నుండి కర్మానుష్టానము ప్రధానముగా నుండువారు పొందు పితృయాణ గతియును నివృత్తిమార్గపరులయి పరతత్వోపాసనా పరాయణులగు వారు పొందు దేవయాన గతియు ప్రతిపాదింపబడినవి. ఈ రెండును లేని వారు జనన మరణ ప్రవాహరూప సంసార గతిలో నానా జీవులుగా పుట్టుచు చచ్చుచు నుండవలసినవారే . అని సంప్రదాయము.

వీనికి సంగ్రహరూపముగా ఆప స్తంబ మహర్షి తనధర్మ సూత్రములందు తన నాటికి ఆర్ష పురాణములందు ప్రసిద్థములని రెండు శ్లోకములను ఉదాహరించియున్నారు. అవి ఇవిః (ఆప. ధర్మ. 2 ప్రశ్న - 23 పటల- 3-4 సూ.)

''అష్టాశీతి సహస్రాణి యే ప్రజా మీషిర ఋషయ ః |

దక్షిణ నార్యవ్ణుః పంథానం తే శ్మశానాని భేజిరే.''

''అష్టాశీతి సహస్రాణి యే ప్రజాం నేషిర ఋషయ ః |

ఉత్తరేణార్యవ్ణుః పంథానం తే7మృతత్వం హి కల్పతే.''

ఈ రెండు శ్లోకములను పై జెప్పిన చాందోగ్యోప నిషదంశమునకు భాష్యములో శ్రీశంకర భగవత్పాదులును ఉదాహరించినారు. ఈ శోకద్వయమునకు వ్యాఖ్యానమే ఈ (మత్స్య-123-శో. 106-116) శ్లోకములు.

ఇందలి దేవయాన పితృయాణ మధ్యయానములను తెలుపునవియే ఈ పురాణమునందలి 123వ అధ్యాయమున చెప్పబడిన నాగవీథ్యాదులగు తొమ్మిది నక్షత్ర వీథులును; అందలి మూడేసి వీథులలో ఏర్పడు 1. ఐరావతపథము 2. జారద్గవపథము 3. వైశ్వానరపథము అను పథ (స్థాన-మార్గ ) త్రయమును.

ఇందు 1. ఐరావతపథమే దేవయానమనబడు ఉత్తర మార్గము 2. జారద్గవపథము మధ్యమ మార్గము; 3. వైశ్వానరపథము పితృయాణము అనబడు దక్షిణ మార్గము. ఈ శ్రీ మత్స్య మహాపురాణమునందలి మార్గత్రయ వ్యవస్థ ఇచట చూపబడినది. (మత్స్య-123 ఆ. పతములో 'గో' 'జరద్గవ' తారుమారైనవి.దిద్దుకొన ప్రార్థన.).

దక్షిణా ద్వినివృత్తో7సౌ విషువస్థో యదా రవిః | క్షీరోదస్య సముద్రస్యోత్తరతోపి దిశశ్చర9. 49

మణ్డలం విషువేచాపి యోజనై స్తన్నిబోధత | తిస్రఃకోట్యస్తు సమ్పూర్ణం విష్ఱువస్యాపి మణ్డలమ్‌.50

తథా శతసహస్రాణి వింశ##త్యేకాధికాపునః | శ్రావణ చోత్తరే కాష్ఠాం చిత్రభాను ర్యదా భ##వేత్‌. 51

గోమేదకస్య ద్వీపస్య ఉత్తరాం చ దిశం చర9. | ఉత్తరాయాః ప్రమాణతు కాష్ఠాయా మణ్డలస్యతు. 52

యోజనానాం ప్రసంఖ్యాతా కోటిరేకాతు సా ద్విజాః | అశీతి ర్నియుతానీహ యోజనానాం తథైవచ | అష్ట పంచాశతం చైవ యోజనా న్యధికానితు.

దక్షిణోత్తరమధ్యాని తాని విన్ద్యా ద్యథా క్రమమ్‌ | స్థానం జరద్గవం మధ్యే తథైరావతము త్తరమ్‌. 54

వైశ్వానరం దక్షిణతో నిర్థిష్టమిహ తత్త్వతః | నాగవీథ్యుత్తరావీథి రజవీథిస్తు దక్షిణ. 55

అశ్వినీ కృత్తికా యామ్యా నాగవీథి స్త్రయః స్మ్రతాః | రోహిణ్యార్థ్ర మృగశిరా గజవీథిరితి స్మృతా. 56

పుష్యాశ్లేషా పునర్వస్వో ర్వీథిశ్చైరావతీ స్మ్రతా | తిస్రస్తు వీథయో హ్యేతా ఉత్తరోమార్గ ఉచ్యతే. 57

పూర్వఉత్తరఫల్గున్యౌ మఖాచైవార్ష భాభ##వేత్‌ | పూర్వోత్తరా ప్రోష్ఠపదే గోవీథీ రేవతీ స్మ్రతా. 58

శ్రవణంచ శ్రవిష్ఠాచ వారుణం వా జరద్గవమ్‌ | ఏతాస్తు వీథయస్తత్ర మధ్యమో మార్గ ఉచ్యతే. 59

హస్తా చిత్రా తథా స్వాతీ అజ వీథిరితి స్మ్రతా | విశాఖా మైత్ర మైయన్ద్రంచ మృగవీథి రిహోచ్యతే. 60

మూలపూర్వోత్తరాషాఢా వీథిర్వై శ్వానరీ స్మ్రతా | స్మృతా స్తిస్రస్తు వీథ్యస్తా మార్గేవై దక్షిణ పునః 61

ఈ మహాపురాణమున ఖగోళ సంస్థానాధ్యాయములందు ప్రతిపాదింపబడిన విషయము అంతయు చాందోగ్యోపనిషత్తునందు పైజెప్పిన భాగములందు ప్రతిపాదింపబడిన విషయమే అనుకొంటిమిగదా! అందు చెప్పబడిన పంచాగ్ని విద్యను ఎరుగవలయును. దానిచే సంసారపు నడక తెలుయును. అనంతరము వారివారి సంస్కారమును బట్టి కొందరకు ప్రవృత్తి మార్గమునందు ఆసక్తి కలుగును; మరికొందరకు సంసార విషయమున జుగుప్స కలిగి నివృత్తిమార్గమునందాసక్తి జనించును. మొదటివారు గృహస్తులు; రెండవవారు * నైష్ఠిక బ్రహ్మాచారులును వాన ప్రస్థులును సంన్యాసులును; వారికి కలుగు పితృయాణ దేవయానములనెడు రెండు గతులును-ఏదియు లేక ప్రాణి సాధారణ జీవనము జీవించు వారు పొందు గతియును చాందోగ్యమున ఇట చెప్పబడినవి.

వీనికి మూలభూతమగు పంచాగ్ని విద్య ఈ పురాణపు ఖగోళ సంస్థానాధ్యాయములందు ఎచట ఎట్లు నిరూపింపబడెనో తెలియవలయును. అందులకై మొదట ఉపనిషత్తునందలి పంచాగ్ని విద్యాదశాక్రమమును తెలియవలయును. ఇది శ్రీ భగవద్గీతయందుఃకర్మము వలన యజ్ఞము-దానివలన పర్జన్యుడు-అతని వలన అన్నము-అన్నము వలన భూతములు (ప్రాణులు) జనించునని చెప్పినదియే.(చూ. భగవద్గీత. అ. 3; శ్లో. 14.)

శ్రద్దా పూర్వకముగ ఇహలోకమున ''యజమానులు'' ''యజనము చేయువారు''అగు గృహస్థులు సమంత్రకముగ చేయు హవనాదిక వైదిక కర్మఫలముగా జలములు ఆదిత్య రశ్ములచే గ్రహింపబడును. అవి ఆవిరి రూపమున అంతరిక్షమునకేగును. అచట అవి ''సోమత్వము ''ను ''ఓషధీ రూప పరిణామ యోగ్యమును దేవతాశక్తి తత్త్వరూపము'' ను 2.''సోముడు'' అనుగ్రహించగా ఈ ''సోమత్వము'' నుండి ఈ ''అప్పులు'' ''పర్జన్యత్వము'' నుందును; పర్జన్యునినుండి ''వృష్టి'' ''వృష్టి'' నుండి 3. ''అన్నము'' ''అన్నము'' నుండి 4. ''రేతస్సు'' ''రేతస్సు'' నుండి 5. ''పురుషుడు'' ''దేహధారి'' జనించును. అని దీని సారాంశము.

ఇచ్చట ఈ పంచాగ్ని విద్యయందలి దశా పంచకములో ఏతద్వివరణమునకై అంగ భూతములగా ప్రథమ దశలో 1. ఈలోకము 2. అదిత్యుడు 3. ఆదిత్యరశ్ములు 4. అహస్సు 5. చంద్రముడు 6. నక్షత్రములు రెండవ దశలో 1. పర్జన్యుడు 2. వాయువు 3. అభ్రము (మేఘములు) 4. విద్యుత్‌ 5. అశని (పిడుగు) 6. హ్రాదని (ఉరుములు) మూడవదశలో 1. పృథివి 2. సంవత్సరము 3. ఆకాశము 4. రాత్రి 5. దిశలు 6. అవాంతర దిశలు నాలుగవ దశలో 1. పురుషుడు 2. వాక్కు 3. ప్రాణము 4. జిహ్వా 5. చక్షుస్సు 6. శ్రోత్రము ఐదవ దశ లో 1. యోషా (స్త్రీ) 2. ఉపస్థము 3. ఉపమంత్రణము 4. యోని 5. అంతః-కరణము (రేతస్సును స్త్రీగర్భమున నలుపుట) 6. అభినందములు (ఆనందానుభవము) అను ముప్పది అంశములు గ్రహింపబడినవి. వీనిలో మొదటి పదునెనిమిదియు ఈ ఖగోళాధ్యాయము నందు మనోహరముగా వర్ణింపబడినవి. మిగిలిన పండ్రెండును సృష్టి విషయకాధ్యాయములందును ఇతరత్రను వచ్చుచునే యున్నవి.

ఇందలి నక్షత్ర గ్రహమండలములు-వాని పరిమాణము-పృధివినుండి వానికి-వానిలో వానికిని పరస్పరమును-కలదూరము వాని గమనము వ్యాసములు చుట్టుకొలతలు మొదలగునవి మనకు అభూత కల్పనలుగా కనబడును. కాని భూమిచుట్టు సూర్యుడు తిరుగును అనినను సూర్యునిచుట్టు భూమి తిరుగును అనినను ఈ ప్రాచీనాధునిక సిద్ధాంతముల వలన గణితముచే కలుగు గ్రహగమన విషయము ఒకే విధమగ సంఖ్యలను ఇచ్చుచున్నట్లే ఇందలి యోజనాది పరిమాణములు కూడా వానిని గ్రహించి ఆయా పద్థతులచే గణితము చేసి చూచినచో ఏమి ఫలితమునిచ్చునో తెలియును. ఇది పరిశోధన పాత్రమగు విషయము; శ్రమతో కూడినపని. కాని ఉపాసనకు సంబంధించినంతవరకు ఇవియన్నియు

_________________________________________

*బ్రహ్మచారులు1. నైష్ఠికులు (వరతత్త్వోపాసన ప్రధానులు 2. ఉపకుర్వాణులు (వేదాధ్యయనాధ్యాపనాది ప్రవృత్తిపరులు) అని రెండు విధములనుందురు.

వాస్తవములుగానే గ్రహింపదగును. ఇందు కొన్ని తావులందలి సంఖ్యలు అభూత కల్పనలుగా కనబడుటకు హేతువులు. ప్రాచీనార్ష వాజ్మయములో - వేదమునందును దానితో అనుబద్ధమగు బ్రాహ్మణాదులందును తప్ప మిగిలిన వానిలో -ముఖ్యముగా పురాణములలో -పాఠములు గందరగోళముగా మారుటయు-వానిని నిర్దారించుటకు అనుకూలమగు సంప్రదాయము విచ్ఛిన్నమగుటయునని ఎరుగవలయును. ఉదాహరణమునకు ఈ పురాణమునందే భవిష్యద్రాజాను కీర్తనాధ్యాయమున సప్తర్షులు 27 నక్షత్రములలో సంచరించుటకగు సంవత్సరములను దివ్యమానములో తెలుపు సంఖ్య అన్ని ప్రతులందును అగమ్యముగా మారియున్నది. ఇది ఇంతవరకు చాలును.

పంచాగ్ని విద్యఎరిగిన వారిలో రెండు విధములవారును -అది ఎరుగని వారును పొందు 1. పితృయాణ 2. దేవయాన 3. మధ్యమయానములను తెలుపుటయే ఈ అధ్యాయమునందలి నక్షత్ర- పథ - వీథీ (మార్గ -స్థాన) ప్రతిపాదమునకు ప్రయోజనము. 5వ పటమును చూచునది. విషయము అవగతమగును.

ఇతర పురాణములలో ఈ వీథులు మొదలగు రూపమున నక్షత్రములు వేరు విధముగ విభజింపబడినవి. అందు 1. అశ్విని మొదలు తొమ్మిదేసినక్షత్రములు ఒక్కొక్క మార్గముగా గ్రహించుట ఒక విధము. 2.భరణి మొదలుగా తొమ్మిదేసి గ్రహించుట మరియొక విధము. 3. గర్గమతము మరియొక విధముగ నున్నది. 1-2విధములలో నక్షత్ర చక్రము నడుమ సమబాహు-సమకోణ-(120´3=360 భాగలుకల) త్రిభుజము ఏర్పడును. అందు విశేషము ఏమియు కనబడదు. గర్గమతము ననుసరించి ఏ వ్యవస్థ ఏర్పడునో తెలియుట అసాధ్యము.

శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము-ప్ర-ఖం. 85 అధ్యాయమున ఈ వియమును చెప్పు శ్లోకములు (ఈ పురాణమున అనేక ప్రకరణములందలి శ్లోకముల వలెనే)

అక్షర దోషములతో-గ్రంథపాతములతో -అస్తవ్యస్తముగానున్నవి. ఏమయినను వానిని కూర్చుకొనగా అందలి నక్షత్ర వీథీ వ్యవస్థ ఇట్లున్నది:

ఉత్తరోత్తరము : నాగవీథి :- భరణి-కృత్తిక-స్వాతి

ఉత్తరమధ్యము : గజవీథి :- రోహిణి-మృగశిర -ఆర్ద్ర

ఉత్తరదక్షిణము : ఐరావత వీథి :-పునర్వసు-పుష్య-ఆశ్లేష -మఖ.

మధ్యోత్తరము : ఋషభవీథి :-పూర్వఫల్గుని-ఉత్తరఫల్గుని

మధ్యమధ్యము :- గోవీథి :-పూర్వాభాద్ర-ఉత్తరాభాద్ర-రేవతి-అశ్విని

మధ్యదక్షిణము : జరద్గవ వీథి :- శ్రవణము- ధనిష్ఠ- శతభిషము.

దక్షిణోత్తరము : మృగవీథి :-హస్త-చిత్ర.

దక్షిణమధ్యము : అజవీథి :- విశాఖ-అనూరాధ.

దక్షిణదక్షిణము : వైశ్వానరవీథి :-జ్యేష్ఠ-మూల-పూర్వాషాఢ-ఉత్తరాషాఢ

ఇవి చూడగా ఈ పురాణమున దీనిని అమర్చినవారికి ఈ నక్షత్రవీథి వ్యవస్థకు ''సంహితా'' ''హోరా'' (ముహుర్త-జాతకములు) అను జ్యోతిఃశాస్త్ర స్కంధద్వయమునందు శభాశుభనిర్ణయము చేయుట తప్ప వేరొక ఆర్ష సంప్రదాయ ప్రయోజనము కలదను భావన దృష్టిలో లేదేమో | అనిపించును.

అదికాక ఇందౖ%ు''వీథీ'' ''పథ'' పదములు ఒకే అర్థమునందు వాడబడినవి. కనుక వారికి ఇచట ఈ రెంటికిని భేదము కలదను భావన యున్నట్లు కనబడదు.

కాని ఈ శ్రీమత్స్యమహాపురాణమునందు చెప్పబడిన విధమున వీథి-పథ విభాగము చేయుటచే దేవయాన పితృయాణములు రెండును రెండు ప్రక్కల నుండగా నడుమ మరల రెండువైపులను సర్వప్రాణి సాధరణముగు మధ్యమ మార్గము ఉండును. వీని విభాజక బిందువులను కలుపగా యజ్ఞ మహా వేదీరూపము ఏర్పడును.

శ్రీమత్యమహాపురాణము

దీని యర్ధము ఇట్లు చెప్పుకొనవచ్చును: యజమానుడు యజ్ఞమాచరించుటకై కూర్చుండగా అతనికిఎదురుగా అగ్నిహోత్రుడుండును. అతనికి ముందు వెనుకలను మధ్యమయానమును కుడి ఎడమలందు దేవయాన పితృయాణములును ఉన్నవి. అవి యజమానునకు ''ఓయీ| నీవు కేవలము దంభమునకు ఈ దేవతారాధనము (యజ్ఞము) చేసితివో| నీకు ముందువెనుకలనున్న ఈ మార్గమే నీకు గమ్యము: పరమార్ధమెరిగి నిష్కాముడవై ఇది చేసితివో| దేవయాన గతి ద్వారమున క్రమముక్తి: సకాముడవై యజించినచో 'పితృయాణ'మున చంద్రలోకమేగుదువు: జన్మావృత్తినందుచుందువు''. అను ఎచ్చరిక చేయుచుండెను.

ఇట్లు మన ప్రాచీన ఋషులు యజ్ఞ వేదికారూప పరికల్పనమును ఈ నక్షత్ర వీథీ వ్యవస్థతో ఏర్పడిన దేవయాన పితృయాణ మధ్యయాన వ్యవస్థనుండియే నిష్పాదనము ఒనర్చిరని ఊహించవచ్చును.

123 అ: 20-33 శ్లో. ఈశ్లోకములయందు చెప్పబడిన విషయము అంత

యు' రవి దేవనివాసమగు మేరువును నిరంతరమును ప్రదక్షిణించుచుండును.'

అను సంప్రదాయమును అనుసరించి చెప్పబడినది. ఆ శ్లోకములు ఇవి:

తారకాసన్ని వేశస్య దివి యావత్తు మణ్డలమ్‌. 19

పర్యాససన్ని వేశస్య భూమేర్యావత్తు మణ్డలమ్‌ | పర్యాయ(స) పరిమాణాభ్యాం భూమే స్తుల్యం దివం స్మృతమ్‌.

మేరోఃప్రాచ్యాం దిశాయాంతు మానసోత్తరమూర్దని | వస్వోకసారా మహేంద్రపురీ

హేమపరిష్కృతా. 21

దక్షిణన పునర్మేరో ర్మానససై#్యవ పృష్ఠతః | వైవస్వతో నివసతి యమ స్సంయమనీపురే .22

ప్రతీచ్యాంచ పునర్మేరో ర్మానససై#్యవ మూర్ధని | సుఖానామా పురీరమ్యా వరుణస్యాపి ధీమతః. 23

దిశ్యుత్తరాయాం మేరోస్తు మానససై#్యవ మూర్ధని | తుల్యా మహేన్ద్రపుర్యాస్తు సోమస్యాపి విభాపురీ. 24

మానసస్యోత్తరే పృష్ఠే లోకపాలా శ్చతుర్దిశమ్‌ | స్థితా ధర్మవ్యవస్థార్థం ధర్మసంరక్షణాయచ. సూర్యసఞ్చారకధనమ్‌. 25

లోకపాలోపరిష్టాత్తు సర్వతో దక్షిణాయనే | కాష్ఠాగతస్య సూర్యస్య గతిం తస్య

నిబోధత. 26

దక్షిణో (ణా)పక్రమే సూర్యః క్షిప్తేషురివ గచ్ఛతి | జ్యోతిషాం చక్ర మాదాయ సతతం పరిగచ్చతి. 27

మధ్యత శ్చామరావత్యాం యదా భవతి భాస్కరః | వైవస్వతే సంయమనే ఉద్యంస్తత్ర ప్రదృశ్యతే 28

సుఖాయా మర్ధరాత్ర్యాంతు విభాయా మస్తమేతిచ | వైవస్వతే సంయమనే మధ్యాహ్నేతు రవి ర్యదా. 29

సుఖాయా మథ వారుణ్యా ముత్తిష్ఠ న్త్సతు దృశ్యతే | విభాయా మర్ధరాత్రంతు మాహేన్ద్ర్యా మస్తమేతిచ. 30

సుఖాయా మథ వారుణ్యాం మధ్యాహ్నే చార్యమా యదా | విభాయాం సోమపుర్యాంతు ఉత్తిష్ఠతి విభావసుః 31

రాత్య్రర్ద మమరావత్యా మస్తమేతి యమస్యచ | సోమపుర్యాం విభాయాంతు మధ్యహ్నే చార్యమాయదా .32

మాహేన్ద్ర మమరావత్యా ముద్గచ్ఛతి దివాకరః | అర్ధరాత్రం సంయమనే వారుణ్యా మస్తమేతిచ . 33

అధ్యాయ క్రమమున విశేష వివరణములు

4. కశ్యప సూర్యుని మేరుప్రదక్షిణము

మత్స్య-123అ.: 21-33శ్లో

యజురారణ్యకము. 1ప్రశ్నము.

వస్వోకపారా-(అమరావతి)

1. మధ్యాహ్నము. ఉదయము. అర్ధరాత్రము. అస్తమయము.

2. ఉదయము. అర్ధరాత్రము. అస్తమయము మధ్యాహ్నము.

3.అర్ధరాత్రము. అస్తమయము. మధ్యాహ్నము. ఉదయము.

4. అస్తమయము. మధ్యాహ్నము. ఉదయము. అర్ధరాత్రము.

శ్రీమత్స్యమహాపురాణము

రవి ఏ ప్రాంతపు క్షితిజమునకు సమాంతరముగా నుండునో ఆ ప్రాంతపు వారికి రవి ఉదయించును. అట్టిరవ్యు దయస్ఠానమునకు డిగ్రీలు ముందున్న వారికి ఈ రవి

లంబరేఖలో కనబడును కనుక అచ్చటి వారికి ఆ సమయము మధ్యహ్నము: అంతకంటె డిగ్రీలు ముందున్నవారికిని ఉదయస్ఠానపు వారికిని నడుమ 180 డిగ్రీలు దూరమయి మధ్యాహ్న స్ఠానము అడ్డముగా నుండును. కనుక వీరి కపుడు రవి అస్తమించుచు

కనబడును. ఉదయస్ఠానమునకు డిగ్రీలు తరువాత నున్నవారి క్షితిజము మీదకు

రవి మరి 6 గంటల (15 గడియల) సేపటిలో పోవును: కనుక వారి కది అర్ధరాత్రము . ఈ విషయమే ఈ 14 శోకములలో చెప్పబడినది.

తైత్తిరీయ యజురారణ్యకమున ప్రథమ ప్రశ్నమునందలి సప్తమానువాకమునందు 'కశ్య

పుడు'అను సూర్యుడు సదా మేరువును విడువక ఉండును: దాని నతడు ఎల్లపుడు పరివర్తించుచుండును; అతని వలననే లోకయాత్రా ప్రవర్తకులగు మిగిలిన ఏడుమంది సూర్యులను 1.ఆరోగః 2. భ్రాజః 3. పటరః 4.పతంగః 5. స్వర్ణరః 6. జ్యోతిషీమాన్‌

7. విభావసుః అను వారు తేజస్సును పొందుదురు. అని చెప్పబడినది. అతడే సర్వ

జగత్కర్మసాక్షియై సమస్త విశ్వమును కనుపెట్టి చూచుచు అనుగ్రహించుచుండును.

(సర్వం-పరి) పశ్యతి- ఇతి- పశ్యకః; పశ్యకః- ఏవ- కశ్యపః-వర్ణవ్యత్యయేన|

సమస్త విశ్వమందలి ప్రతియొక తత్వమును సూక్ష్మమగు అనుగ్రహదృష్టితో చూచువాడు కావున 'పశ్యకః'- ఈ పశ్యక శబ్దమే ఆద్యంత వర్ణముల మార్పడిచే 'కశ్యపః' అగును.

''కశ్యపః పశ్యకో భవతి- యః సర్వం పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్‌ .''

NRPXxtñsQ¸R…VÇÁÙLSLRißáùNRP c 1 úxmsaRPõc 8 @ƒ«sVªyNRPª«sVV.

మత్స్య-123 అ. శ్లో. 19-33. ఈ శ్లోకములందు ప్రతిపాదింపబడిన కశ్యప సూర్యుని మహామేరు ప్రదక్షిణ విషయము అంతయు ఛాందోగ్యోపనిషత్తునందును ప్రతిపాదింబడియున్నది:

'స యావ దాదిత్యః పురస్తా దుదేతా పశ్చా ద స్తమేతా - ద్విస్తావ ద్దక్షిణత

ఉదేతో త్తరతో7 స్తమేతా.'' .(ఛాం. అ3 .ఖం 7.అను. 4.)

''స యావ దాదిత్యో దక్షిణత ఉదేతోత్తరతో7 స్తమేతా- ద్విస్తావ త్పశ్చా దుదేతా పురస్తా దస్తమేతా.'' (ఛాం. అ. 3.ఖం. 8-అను.4. )

''స యావ దాదిత్యః పశ్చా దుదేతా పురస్తా దస్తమేతా - ద్విస్తావ దుత్తరత ఉదేతా

దక్షిణో7 స్తమేతా.''(ఛాం. అ. 3-ఖం 9. అను. 4.)

''స యావ దాదిత్య ఉత్తరత ఉదేతా దక్షిణతో 7 స్తమేతా - ద్విస్తావ దూర్ధ్వ ఉదే

తా7 ర్వా జస్తమేతా.'' (ఛాం. అ.3-ఖం. 10.అను.4.)

ఈ శ్రుతి వచనములపై శ్రీ శంకర భగవత్పాదుల భాష్యమును దానిపయి ఆనంద జ్ఞానులవారి వ్యాఖ్యయును చాల స్పష్ట వివరణమును ఇచ్చుచు ఈ విషయమున

పురాణ వచనములను శ్రుతి వచనములతో ఎట్లు సమన్వయపరచుచు విచారించవలయునో నిరూపించుచున్నవి.

అధ్యాక్రమమున విశేష వివరణములు

యుగావయవములగు పంచ సంవత్సరములు.

124-140 అధ్యాయములందును త్రిపురాసుర సంహారక కథయందును 'ఐదేసి సంవత్సరములు ఒక యుగము' అను భావనకు చెందిన యుగపు అవయవములగు పంచ సంవత్సరముల విషయము తెలిసికొనదగియున్నది.

ఇది మొదట'పంచ సంవత్సరమయ యుగాధ్యక్షం ప్రజాపతిమ్‌' అని వేదాంగ జ్యోతిషమునందు కనబడుచున్నది.

శ్రీమద్భాగవతమునందు పంచమ స్కంధమున ద్వావింశాధ్యాయమున ఏడవ వచనము:

''అథ చ యావ న్నభోమండలం సహ ద్యావాపృథివ్యో ర్మండలాభ్యాం కార్త్స్యేన సహ భుంజీత- తం కాలం సంవత్సరం పరివత్సర మిడావత్సర మనువత్సర వత్సరమితి

భానో ర్మాంద్య శైఘ్య్ర గతిభిః సమామనంతి . 7.''

మత్స్యపురాణమునందు 124వ అధ్యాయమునందును-త్రిపురాసుర సంహార కథయందలి పరమేశ్వర రథనిర్మాణ కథయందు 131వ అధ్యాయమునందును 'అరాః సంవత్సరాః పంచ' అనియు 140వ అధ్యాయమున-

''తేషు సంవత్సరో హ్యగ్ని ః సూర్యస్తు పరివత్సరః |

సోమ స్త్విద్వత్సర శ్చైవ వాయుశ్చైవానువత్సరః|

రుద్రస్తు వత్సర స్తేషాం పంచాబ్దా యే యుగాత్మకాః.'

అనియు నున్నది.

పైవానిలో శ్రీమద్భాగవత వచనము పై శ్రీధరస్వామి వ్యాఖ్య:

''మండలాభ్యాం సహ భుంజీత- స- హ- స హి సూర్యః- యదా శుక్లప్రతిపది సంక్రాంతిర్భవతి- తదా - సౌరచంద్రయో ర్మాసయో ర్యుగప దుపక్రమో భవతి- స- సంవత్సరః- తతః సౌరమానేన వర్షేషట్‌ దినాని వర్థంతే- చాంద్రమానేన షట్‌ దినాని హ్రసంతీతి- ద్వాదశదిన వ్యవధానా ధుభయో రగ్ర పశ్చాధ్బావో భవతి; ఏవం పంచ వర్షాణి గచ్చంతి; తన్మధ్యే ద్వౌ మలమాసౌ భవతః; తతః పునః షష్ఠ సంవత్సరో భవతి; త దేవ మవాంతరభేదేన సంవత్సరాది పంచకం సమామనంతి.''

ఈ విషయమయి 'మల మాసతత్త్వమ్‌' అను ధర్మ నిబంధ గ్రంధమున:

'శకాబ్దాత్‌ పంచభిః శేషాత్‌ సమాద్యాదిషు వత్సరాః |

సంపరీదానుపూర్వాశ్చ | తథోదాపూర్వకా మతాః. ఇతి.'

(వాచస్పత్యమునుండి)

ఈ సంవత్సరాది పంచ సంవత్సరములయందును చేయదగిన దానములును తత్ఫలములను విష్ణు ధర్మోత్తరమున:

''సంవత్సరే తథా దానం తిలస్య చ మహాఫలం |

పరిపూర్వే తథా దానం యవానాం చ ద్విజోత్తమాః !

ఇదా పూర్వే7న్నవస్త్రాణాం ధాన్యానాం చానుపూర్వకే |

ఉదా సంవత్సరే దానం రజతస్య మహాఫలమ్‌. ఇతి.''

మరియు మలమాన తత్త్వమునందే

''జ్యోతిర్విద స్త్విజ్యమధ్యాత్‌ ప్రభవాదేశ్చ సంభవమ్‌ |

ఊచు స్తద్వ త్సమాద్యాది వర్షాణామపి సంభవమ్‌. ఇతి.''

ఇందు గమనింపవలసిన యంశములు:

1. శ్రీమద్భాగవతమునందును శ్రీమత్స్యమహాపురాణమునందును యుగాంగములగు ఐదు సంవత్సరముల పేరులును 1. సంవత్సరము 2. పరివత్సరము 3.ఇడా (దా) వత్సరము 4. అనువత్సరము 5. వత్సరము అనియున్నది. (మత్స్యపురాణమున మూడవది ఇద్వత్సరము అనియున్నది. ఇది ఛంధో7నుకూలతకై 'ఇదా' అనుటకు మారు 'ఇద్‌' అనుట కావచ్చును); పరివత్సరము అనెడు పదముకేవలము 360 అహోరాత్రములతో అగు సంవత్సరము అను అర్థములో కూడ ఆర్ష వాజ్మయమున కనబడుచున్నది.

2. ఇక విష్ణు ధర్మోత్తరమునందును మలమాన తత్త్వమునందును ఐదవదాని పేరు ఉదావత్సరము అనియున్నది.

3. జ్యోతిశ్శాస్త్ర తత్త్వానుసారము వీని వివరణమున శ్రీధరస్వామివారు ఇచ్చిన దాని యర్థము: 'చాంద్రమానము ననుసరించి చైత్ర శుక్ల ప్రతిపత్‌ తిథియు సౌరమానముననుసరించి సూర్యుని రాశి ప్రవేశమును ఒకేమారు ఏ సంవత్సరమున జరుగునో అది 1. సంవత్సరము దాని తరువాత వచ్చు నాలుగు సంవత్సరములకును వరుసగా పైని చెప్పిన పేరులు వర్తించును. ఏలయన- ఇందు మొదటిదగు 'సంవత్సరము' నకు తరువాత నుండి క్రమముగా సౌరమాన సంవత్సరమున ప్రతిఏట ఆరేసి దినములు పెరుగుటయు చాంద్రమాన మాసమున ఆరేసి దినములు తగ్గుటయు జరుగుచు ఒక్కొక్క ఏడాదిలో పండ్రెండేసి దినములు భేధము ఏర్పడును. ఇట్లు సాగిపోవు ఐదేండ్ల కాలములో రెండు మల (సూర్యుని రాశి ప్రవేశములేని) మానములు వచ్చును. ఇవియే అధిక మాసములు.'

4. ఇక 'మలమాస తత్త్వ' మను నిబంధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది: శాలివాహనశక సంవత్సర సంఖ్యను ఐదుచే భాగించగా వచ్చు శేషము 1 అయినచో ఆ వర్షమును సంవత్సరము-2 అయినచో పరివత్సరము 3 అయినచో ఇదావత్సరము 4 అయినచో అనువత్సరము 5 అయినచో ఉదావత్సరము అని ఎరుగవలయును.

5. దీనినిబట్టి శాలివాహన శకారంభము ఈ ఐదింటిలో 'సంవత్సరము' తో (సౌర చాంద్రమాసముల ఆరంభము ఒకే దినమున అయిన ఏట) అయ్యెనని తెలియును. మన అనుభవమును బట్టి ఈ శాలివాహన శకము ఒకానొక 'ప్రమాది' నామ సంవత్సరమున ఆరంభమయినది.

6. 'జ్యోతిర్విదః' అను 'మల మాసతత్త్వ' శ్లోకము మరియొక సూక్ష్మ విషయమును కూడ చెప్పుచున్నది: అదియేమనిన: ప్రభవ మొదలగు ఆరువది సంవత్సరములలో మొదటిదగు ప్రభవ సంవత్సరముకాని పంచ సంవత్సరములలో మొదటిదగు 'సంవత్సరము' కాని ''ఇజ్య'' మధ్యముతో ఆరంభమగును. ఇజ్యుడు అనగా బృహస్పతి; ఏడాదికి ఒకటి చొప్పున రాశి సంచారము చేయు బృహస్పతి తాను చేయు రాశి సంచారములో ఒకరాశికి ఇంచుమించుగా నట్టనడుమ (అనగా ఆ రాశిలో 15 భాగలు ఇంచుమించుగా గడచి) ఉండగా ఆరంభమగును.

ఈ యంశము ఈ రాబోవు ప్రభ వ (1987 క్రీ. శ.) సంవత్సరారంభమున సరిగా నున్నదని గమనించ వచ్చును.

బార్హస్పత్యమానము అనగా బృహస్పతి రాశి సంచారముపై ఆధారపడిన గణనము.

చాంద్రమాన సౌరమాన బార్హ స్పత్యమానములకు గల పరస్పర సంబంధము ఇట్టిది. ఇది ఏమాత్రమును త్రోసివేయరాని గణితశాస్త్రమును అనుసరించి సరిపోవుచున్న విషయము. పుక్కిటి పురాణము కాదు.

మన పూర్వులు చెప్పిన విషయములలో కొన్ని మన హేతువాదాభాసములకు సరిపోవుచున్నట్లు కనబడకున్నను వాని వెనుకనున్న తత్త్వమును సరియగు హేతువులతో ఆలోచించవలయును.

131 అ.

''చతుర్భి శ్చిత్రితం షడ్చి ర్థనుః సంవత్సరో7భవత్‌ |

అజరా జ్యా7 భవచ్చాపి సాత్త్వికీ ధను షోదృఢా.''

చతుర్భిః షడ్భిః =4´6=24 పక్షములతో; అజరా-(అ) శిథిలా; దీనికి హేతువును ప్రతీకతము 40వ శ్లోకమునందు:

''కాలో హి భగవాన్‌ రుద్ర స్తం చ సంవత్సరం విదుః |

తస్మా దుమా కాలరాత్రీ ధనుషో జ్యా7 జరా7 భవత్‌.''

అని చెప్పబడినది; దీనిని బట్టియే కాలరాత్రి పైకి తామసిగా కనబడుచున్నను వాస్తవమున సాత్త్వికియని తెలియుచున్నది.

131 అ. 29 శ్లో. ''చాతుర్హోత్ర ప్రయోజకాః చతుర్వర్ణాః.''

చాతుర్హోత్రియములు అను యజ్ఞ విశేషములు కలవు; వీనియందు బ్రహ్మయును అధ్వర్యుడును కాక హోతతో మొదలుగా 1. హోత 2. ఆగ్నీధ్రుడు 3. ప్రతిప్రస్థాత 4. మైత్రావరుణుడు అను నలుగురు ఋత్విజులు మాత్రము ఉందురు. వీరిలో బ్రహ్మ - అధ్వర్యుడు-హోత-ఈ ముగ్గురును ముఖ్యులు; బ్రహ్మకు ఆగ్నీధ్రుడును అధ్వర్యునకు ప్రతి ప్రస్తాతయు హోతకు మైత్రావరుణుడును సహాయులు. హోత మొదలుగా ఈ నలుగురు మాత్రమే ప్రయోజకులుగా (యాగ ప్రయోగ నిర్వాహకులుగా) ఉండు యాగములకు శాస్త్రమునందు 'చాతుర్హోత్రియములు' అని వ్యవహారము.

ఈ శ్లోకమున ఈ నలుగురును 'చతుర్వర్ణాః' అనుటచే వీరు వరుసగా బ్రాహ్మణాది చతుర్వర్ణములకును సంకేతభూతులు అని గ్రహించవలసియున్నది.

133 అ. శ్లో. 63. మంజువాక్‌ -చిలుక ; 'పంజరే మంజువాగ్యథా.'

135అ.శ్లో.23.సకాశము-(సమీపము) అను నర్థమున 'సంకాశమ్‌'-ప్రయోగింపబడినది.

'సాగరేశ్వర సంకాశ ముత్పపాత పురం వరమ్‌.'

140 అ. 5-6 శ్లో. ఇందు ''మండల '' శబ్దము 'భాగ' (Degree) అను అర్థ మున ప్రయోగింపబడినది.

సనత్కుమారుడు-స్కందుడు

మత్స్యపురాణమునందును మరి ఇతర పురాణములందును ఈ ఇరువురిలో ఒకరు వక్తగా నో శ్రోతగానో ఉన్నట్లు చెప్పుట కనబడుచుండును. వీరితో పాటు సనక సనందన సనత్సుజాతులును వినబడుచుందురు. వీరందురును నివృత్తి మార్గ ప్రవర్తకులగు బ్రహ్మ మానస పుత్రులని సంప్రదాయమున తెలియుచున్నది. స్కందుడు శివకుమారుడగు కార్తికేయ భగవానుడని పురాణములు చెప్పుచున్నవి. స్కంద సనత్కుమారులు ఇరువురును ఒక్కరేయని చాందోగ్యోప నిషద్వచనము.

''తసై#్మ మృదిత కషాయాయ (నారదాయ) తమసస్పారం దర్శయతి భగవాన్‌ సనత్కుమారః; తం స్కంద ఇత్యాచక్షతే.'' (చాందోగ్య -7-26-2.)

ఇదిఎట్లు?ఆలోచించగాశబ్దవ్యుత్పత్తిచేసనక-సనందన-సనత్కుమార-సనత్సుజాత-స్కందులు అందరును ఏకరూపులే. లోకమున (నివృత్తి) ధర్మ ప్రవర్తనమునకై భిన్నరూపులై వ్యవహరించుచుందురు. అని తెలియుచున్నది.

సనాత్‌-అను అవ్యయమునకు 'సదా' 'ఎల్లప్పుడు' అని అర్థము.

1. సనాత్‌-క>సనత్‌-క> సన(త్‌)-క=సనక.

2. సనాత్‌-నందన>సనత్‌-నందన>సన(త్‌)-నందన>స(న)-నందన సనందన.

3. సనాత్‌-కుమార>సనత్‌-కుమార=సనత్కుమార.

4. సనాత్‌-సుజాత>సనత్‌-సుజాత-సనత్సుజాత.

5. సనత్‌-క>(వర్ణ వ్యత్యయముచే) స్‌ (అ) క-న్‌-త్‌-అ>స్‌-కన్‌-ద్‌-అ>స్కంద.

ఇందు 'క' అల్పార్థకము కావున 'బాల' అను అర్థమును తెలుపును. జాత-కుమార-నందన శబ్థములు సమానార్థకములేకదా. 'సు' అనగా'శోభన' 'మంచి' అనిఅర్థము.

ఇట్లు అంతయు సరిపోయినది.

141 అ; (శ్లో 48.)'అథ' ఈ పదము ఇచట ప్రణవముతో సమానార్థకముగాను మంగళార్థకముగాను ఉన్నది.

141 అ. 'సకృత్పూర్వకమ్‌' అను పదము 'అదియే మొదటిసారిగా' 'వారికి ఎవరి నుండియు ఉపదేశము లేకుండ' అను అర్థములో ఉన్నది.

141 అ. ధ్రువ వర్షము=9090 మానవ సంవత్సరములు; సప్తర్షి వత్సరము=3030 మానవ సంవత్సరములు. (దీని ననుసరించి మానవమానమున 8సం. 5 మా.=1ధ్రువాహోరాత్రము; మానవమానపు 25సం. 3 మా=1 సప్తర్ష్య్‌హోరాత్రము).

ఇక శ్రీమత్స్యమహాపురాణమును (అథవా ఆర్ష వాజ్మయమును) సరిగా అవగాహనము చేసికొనుటతో ఉపకరించు కొన్ని ముఖ్యాంశముల వివరణములు :

వేదము-దశాత్రయము (మత్స్య-141 అ.)

వేదము మూడు దశలలో ఉండును : 1. విజ్ఞాతము 2. దృష్టము 3.శ్రుతము. ఋషులు వేదమును అంతటిని ''విజ్ఞాతము'' 'తమ అనుభూతియందు గోచరమగునది' గా చేసికొనిరి. ఇది మొదటి దశ; ఇందు వైదిక వాక్కు పరాపరా-పరా-పశ్యంతీ-వాగ్‌ దశలయందుండును. అనంతరము వారు ఆవేదమును స్పష్టముగా తత్తదర్థ ప్రతిపాదక శబ్థరూపమునను ఆ శబ్దములచే ప్రతిపాదితమగు అర్థరూపమునను వివిక్తముగా-విడివిడిగా - దర్శించిరి. ఇది రెండవదశ; ఈ దశయందు వైదికవాక్కు మధ్యమా వాగ్‌ దశయందుండును. తదనంతరము వారు ఆ శబ్థరాశిని స్పష్టముగా నుచ్చరించిరి. అధికారులగు వారికి అందజేసిరి. ఆ ఋషులు అందజేసిన దానిని ఆయా అధికారి జనులు తమ చెవులతో 'శ్రుతము' 'వినబడినది'గా చేసికొనిరి. ఇది మూడవదశ; ఈ దశ యందు వైదిక వాక్కు వైఖరీ వాగ్‌ దశయందుండును. ఇట్టి దశాత్రయము కలది కావున వైదిక వాగ్రాశికి 'త్రయీ' అను వ్యవహారము సంపన్నమగుచున్నది.

లౌకికమగు భాషకుగు ఈ మూడు దశలను ఉన్నవి. ఐనను తాత్త్విక విచారణ పూర్వకముగా మానవులకు ఇహపర సుఖములను సాధించు వైదిక వాజ్మయమునందు మాత్రమే త్రయీ పదము రూఢమయినది. ఋక్‌ సామ యజుర్‌ వేదములకు మూడిటికిని 'త్రయీ' అని వ్యవహారము అనుట మరియొక విధమయినది.

మానవ పితృ దివ్య మానములు. (141 అ.)

వీని విషయము శ్రీవిష్ణు ధర్మోత్తర ద్వితీయ ఖండమందలి 168వ అధ్యాయమున (పైతామహ సిద్ధాంత వచనము) ఇట్లున్నది :

1. అర్కభాగభోగః సౌరాహోరాత్రః;

2. తిథిశ్చ చాంద్రః;

3. అర్కోదయా దుదయా త్సావనః;

4. చంద్ర నక్షత్ర భోగో న(నా) క్షత్ర మ్‌ (త్రః);

5. సావనో7హోరాత్రో నరణామ్‌; తేషా మార్కందినమ్‌; వ్యర్కా రాత్రిః;

6. చాంద్రమాసః పితౄణామహోరాత్రమ్‌; తేషాంకృష్ణాష్టమ్యామర్కోదయః; అమావాస్యాయాం మధ్యాహ్నః; శుక్లాష్టమ్యా మస్తమయః : పౌర్ణమాస్యా మర్థరాత్రమ్‌;

7. అర్కభగణభోగో దివ్యో7హోరాత్రః; తేషా మర్కస్య మేషప్రవేశే సూర్యోదయః; కర్కట ప్రవేశే మధ్యాహ్నః; తులాప్రవేశే 7స్తమయః; మకరప్రవేశే7ర్థరాత్రః.

ఈ వచనముల వివరణము :

1. భ(నక్షత్ర) చక్రమునందలి 360 భాగలలో నుండి రవి దినము 1కి 1 భాగ చొప్పున ముందునకు పోవుచుండును. ఈ రవికి గల 1 భాగ గమనము ఒక సౌరాహోరాత్రము.

2. అమావాస్యనాడు ఒక నిర్ణీత సమయమున సూర్యచంద్రులు ఇరువురును భ(నక్షత్ర_రాశి) చక్రమునందలి ఒకే రాశిలో-ఒకే భాగలో-ఒకే లిప్తలో-సరిగా ఒకే బిందువున ఉందురు. అప్పటినుండి వారిద్దరికి నడుమ దూరము 180 భాగలవరకు పెరుగుచుపోవును; మరల తగ్గుచు వచ్చును. ఈ దూరము ఒక్కొక్క 12 భాగలు ఒక్కొక్క తిథి పరిమాణము; ఈ దూరము పెరుగుచుపోవు 15 విభాగములు (15x12=180 భాగలు)శుక్లపక్షము; తగ్గుచువచ్చు 15 విభాగములు కృష్ణపక్షము; ఇట్టి ఒక్కొక్క (12డి.) విభాగము ఒక్కొక్క తిథి ; ఈ తిథికే చాంద్రాహోరాత్ర మని పేరు.

3. సూర్యోదయమునుండి సూర్యోదయమువరకు అగుకాలము సావనాహోరాత్రము.

4. చం ద్రుడు భచక్రమునందలి 27 నక్షత్రముల (12 రాసుల) లో ఒక్కొక్క నక్షత్రమును అనుభవించు (1 నక్షత్రముతో=13 భాగల 20 లిప్తలతో కూడియుండు) కాలము నాక్షత్రాహోరాత్రము.

5. ఇందు సావనాహోరాత్రమే మానవమానపు అహోరాత్రము. ఈ సావనాహోరాత్ర కాలపరిమితిలో రవి భచక్రములో 1 భాగ అంతదూరము ముందునకు సాగును; సూర్యునితో కూడిన భచక్రమంతయు భూక్షితిజమును క్రమముగ తాకుచు భూమిచుట్టును ఒకసారి ప్రదక్షిణించినట్లు కనబడును; ఈ గమన క్రమములో భచక్రపు ఏ అంశము భూగోళపు తూర్పు క్షితిజము (Eastern Horizon) ను తాకునో ఆ భచక్రాంశము 'లగ్నము' అనబడును; భూగోళ కపాలాంశములపై సూర్యుని ఉనికిని బట్టి సూర్యోదయాస్తమయములును మధ్యాహ్నార్థ రాత్రములును ఏర్పడును.

ఇట్లు భూమండలమునందు ద్రష్ట (చూచుచున్న మానవుడు) ఉన్నస్థానమును బట్టి తూర్పు క్షితిజముపౖౖె రవి ఉన్న సమయము సూర్యోదయము; ఈ తూర్పు క్షితిజమునకు పైగా రవి 90 భాగల దూరమునకు వచ్చినపుడు మధ్యాహ్నము; రవి పశ్చిమ క్షితిజమునకు సరిగా (తూర్పు క్షితిజమునుండి 180 భాగల దూరములో నున్నప్పుడు అస్తమయము; అచ్చటి నుండి మరి 90 భాగల (తూర్పు క్షితిజ మునుండి 270 భాగల ) దూరములో ఉండగా అర్థరాత్రము.

1. మానవమానము - అహోరాత్రవ్యవస్థ

Diagram

6. చాంద్రమానముచే ఏర్పడు మానవమాసము పితృమానముచే ఒక అహోరాత్రమగును. ఇంత అవధిలో రవి ఇంచు మించుగా ఒక రాశి (30 భాగల) దూరము ముందునకు సాగును. ఈ మానము ననుసరించి మానవమాస కృష్ణపక్షాష్టమిసగము గడచినప్పుడు రవిచంద్రులనడుమ దూరము అపసవ్యగతిలో 270 భాగలు ఉండగా పితృమాన సూర్యోదయమగును; అమావాస్యనాడు మధ్యాహ్నమగును; శుక్లాష్టమి నగము గడచిన తరువాత సూర్యాస్తమయము; పూర్ణిమనాడు అర్థ రాత్రమగును.

2. పితృమానము - అహోరాత్ర వ్యవస్థ

Diagram

మానవమానానుసారముగ

1 కృష్ణపక్షాష్టమీ మధ్య కాలపు చంద్రుడు-రవి నుండి లో

2 అమావాస్యాంతమున చంద్రుడు రవి నుండి లో

3 శుక్లపక్షాష్టమీ మధ్య కాలపు చంద్రుడు రవి నుండి లో

4 పూర్ణిమాంత చంద్రుడు-రవి నుండి లో

7. రవి భ(నక్షత్ర) చక్రమునంతను ఒకమారు చుట్టి వచ్చుటకగు (సౌరమాన ద్వాదశ మాస) కాలము దివ్య మానానుసారము ఒక అహోరాత్రము; ఇందు రవి మేష ప్రవేశమున దివ్యమాన సూర్యోదయము; కర్కట ప్రవేశమున మధ్యాహ్నము; తులాప్రవేశమున దివ్యమాన సూర్యాస్తమయము; మకర ప్రవేశమున మధ్యరాత్రమగును.

3. దివ్యమానమున అహోరాత్ర వ్యవస్థ

Diagram

1. రవి మేష ప్రవేశముతో దివ్యమాన సూర్యోదయము.

2. రవి కర్కట ప్రవేశముతో దివ్యమాన మధ్యాహ్నము.

3. రవి తులా ప్రవేశముతో దివ్యమాన రవ్యస్తమయము.

4. రవి మకర ప్రవేశముతో దివ్యమాన మద్యరాత్రము.

జ్యోతిర్గణితములో వీని ఉపయోగము.

ప్రాచీన భారతీయుల సిద్దాంత గ్రంథములందు ఆయా గ్రహముల మహాయుగ భగణములను (12000 దివ్య వర్షములలో గ్రహము ఎన్ని మారులు మొత్తము భచక్రమును చుట్టివచ్చునో అవి) చెప్పిరి. పైతామహాది సిద్దాంతములలో కల్ప (12000000 దివ్య వర్షముల) భగణములను చెప్పిరి. దివ్య వర్షములను మానవ వత్సరములుగా మార్చి కొని-ఇన్ని భచక్రా వృత్తులకు ఇన్ని సంవత్సరములు పట్టినచో - ఒక భచక్రా వృత్తికి ఎంతకాలము పట్టును? అను త్రైరాశికము (Direct proportion) చే గ్రహపు 1 భచక్రావృత్తికగు సగటు కాలపరిమితిని కొన్ని దశాంశములవరకు కచ్చితముగా కనుగొనవచ్చును.

అష్టకాః_అన్వష్టకా.

మార్గశీర్ష పుష్యమాఘ ఫాల్గున మాసముల కృష్ణపక్షములందలి సప్తమి-అష్టమి-నవమి-ఈ మూడు తిథుల సముదాయమునకు 'అష్టకాః' అను వ్యవహారము; వీనియందలి నవమిని 'అన్వష్టకా' అందురు.

141 అ. శ్లో-53; 'దర్శనై స్తారకాదిభిః' : అంతరిక్షమందలి తారకలు అవి అచ్చటి సన్నివేశము (అమరిక) తో విచిత్రములును విలక్షణములును అయి భగవదుపాసనకో లోకమున ధర్మమును ప్రవర్తిల్లజేయుటకో ఉపయోగించు కొన్ని అంశములను సూచించుచుండును. దీనిని ఋషులు తమ తపోబలముచే ఎరిగి అవి వేదమంత్రములుగా తమకు వినబడగా వానిని తమ శిష్యులు మొదలగువారికి అందించిరి. అని భావము. ఇట్టి మంత్రములు వేద వాజ్మయమున ఎన్నియో కలవు. పురాణములందును ఈ నక్షత్ర సన్నివేశ మూలకములగు కథలు ఎన్నియో కలవు. ఈ విషయమున శ్రీ 'నారాయణ అయ్యంగార్‌' తాము రచించిన ''Essays on Indo-Aryan Mythology'' అను పుస్తకములో కొన్ని వివరణములు ఇచ్చినారు. మనవారు ఇంకను చాలమంది ఈ విషయమున చాల కృషి చేసి పుస్తకములు వ్రాసియున్నారు.

'ఆత్మ' పంచ విధములు.

అవ్యక్తాత్మామహాంతాత్మా 7హంకారాత్మా తథైవచ |

భూతాత్మా చేంద్రియాత్మాచ తేషాం తద్జాన్ఞముచ్యతే.

మత్స్య-144 అ.శ్లో. 88-89.

ఈశ్వర తత్త్వాత్మకమగు 'ఆత్మ' తన శక్తులను క్రమముగ సంకుచితపరచుకొనుచు జగద్రూపమున పరిణమించు దశలలో ఇవి వరుసగా ఒక దానికంటె మరియొకటి స్థూలతరములు. వీనిలో 'భూతాత్మా' అనుచోట భూతములు అనగా సూక్ష్మభూతములు (భూతతన్మాత్రలు); ఈ ఆత్మ దశా పంచక విషయకమగు తాత్విక జ్ఞానమును-దానిని నిత్యానుభూతిలో ఉంచుకొనుటయు 'కల మహానుభావులు ఈశ్వరులు' మొదలగు శ్రేణులకు చెందినఋషులు అని శ్లోకార్థము. (చూ. అను వాద వివరణము)

ఋషులు ఐదు విధములుగా నుందురు. ఈ విషయమున సవివరణముగా నూట నలువది నాలుగవ అధ్యాయములోనే కలదు. అట చూచి తెలిసికొనునది.

144 అ; 79 శ్లో. 'ఋషి ర్హింసా గత్యోర్థాతుః'. కాని పాణినీయ ధాతు పాఠములో 'ఋషీ_గతౌ అని మాత్రము కలదు; ఈ ధాతువునకు హింసార్థకత్వము చెప్పనిచో ఋష్టి శబ్ధము నిష్పన్నము కాదు; 'ఋష్టి' అయుధము కావున-ఇచట 'ఋషీ' ధాతవు హింసార్థకమే; A.A. Macdonells Vedic Grammerలో 'ఋష్‌'=Rush అని యున్నది. అతడే ఋక్‌ - 1 మం. 85 వ సూక్తమున 4వ ఋక్‌ లో 'ఋష్టి' శబ్దవ్యుత్పత్తికై 'ఋష్‌=Thrust అని ఇచ్చెను. కనుక ఈ మత్స్యపురాణములో ఇచ్చిన దానిని బట్టి ఇది పాణినీయేతర ధాతుపాఠములలోనిదని చెప్పవలెను. ఇది ప్రయోగములందు గల 'ఋష్టి' మొదలగు రూపముల సిద్ధికిని వాని అర్థమునకును సరిపోవును.

కాలపు పంచాంగములు :

(1. తిథి-2 వార-3 నక్షత్ర-4 యోగ-5 కరణములు.)

2. వారము: గ్రహములలో రవి చంద్రకుజ బుధగురు శుక్ర శనులను ఏడుమందిని వరుసగా ఏడు దినములకు అధిపతులుగా-అథవా-ఏడు దినములను ఈ ఏడు గ్రహములకు ప్రతీకములనుగా-గ్రహించి లెక్కించుట వార వ్యవస్థకు మూలము. ఇవి1. ఆది(త్య) 2. సోమ 3. మంగళ 4. బుధ 5. గురు 6. శుక్ర 7. శనివారములు.

3. నక్షత్రము: భాగలుగా అమరియున్న నక్షత్ర వృత్తము (భచక్రము)ను 27 నక్షత్రములుగా విభజించగా 'అశ్విని' మొదలుగా 'రేవతి' వరకు ఒక్కొక్కటి 13 భాగల 20 లిప్తల చొప్పున దూరమును ఆక్రమించి (13 భా. 20 లి. ´ 27=360 భాగలు) యున్నవి. చంద్రుడు ఎంతకాలము ఇందలి ఒక్కొక్క నక్షత్రమున ఉన్నట్లు కనబడునో అది ఆ నక్షత్రపు కాలపరిమితిగా గణన చేయుదురు.

1. చంద్రుడు వలెనే రవియును (అట్లే ఇతర గ్రహములును) భచక్రమునందు సంచరించుచుండుట మనకు కనబడును. రవి ఒక్కొక్క దినమునకు ఒక్కొక్క భాగ వంతున ఈ భచక్రమున ముందునకు సాగుచుండును.

ఈ గమనములో ఒక సమయమున రవి చంద్రులు ఇద్దరును ఒకే స్థానమునకు వత్తురు. క్రమముగ వీరిరువుర నడుమ 180 భాగల దూరము ఏర్పడును. మరల అక్కడి నుండి దూరము తగ్గుచు వచ్చును. చివరకు ఇద్దరును ఒకే స్థానమునకు వత్తురు.

ఇట్లు ఇరువురు ఒకే స్థానమున ఉన్న తిథి అమావాస్య. (అమా=సహ; కూడ; ఒకే చోట కలిసి; వస్‌=ఉండు; అను అర్థముతో); ఇరువుర నడుమ180 భాగల దూరమున్న తిథి పూర్ణిమ; శుక్ల ప్రతిపత్‌ మొదలు పూర్ణిమ వరకు 15+పూర్ణిమానంతరము కృష్ణ ప్రతిపత్‌ మొదలు అమావాస్య వరకు వదునైదు=30 తిథులు.

360 భాగలు % 30=12 భాగలు=720 లిప్తలు; కనుక సూర్యచంద్రుల నడుమ దూరపు భాగలను 12చే భాగించగా వచ్చు లబ్థము గడచిన తిథులను-శేషముగా అనునది గడచుచున్న తిథియు అని యెరుగవలెను.

4. యోగము: సూర్యుడు భచక్రమున తాను ఎంతవరకు నడచెనో చంద్రుడును అట్లే భచక్రమున ఎంత వరకు నడచెనో అరెండు గమనములను కూడగా ( యోగము=కూడిక ) అగు భాగల పరిమాణమును లిప్తలుగా మార్చి దానిని 800 లిప్తలతో (800 లి.=13 భా. 20 లి.) భాగించగా లబ్థము గడచిన యోగములును శేషము గడచుచున్న యోగపు భుక్తియును అగును.

ఇవి విష్కంభము మొదలు వైధృతము వరకు 27.

5. కరణము : ఇది తిథిలో రెండవ భాగము; ఇవి దినము ఒకటికి రెండు చొప్పున ప్రవర్తిల్లును. ఇవి మొత్తము 11; (బవ మొదలు కింస్తుఘ్నము వరకు).

యాగ హవనముల భేదము.

(కాత్యాయన శ్రౌత సూత్రములు; అ1; 2 పా. 5-6-7 సూత్ర.)

''5. యజతి జుహోతీనాం కో విశేషః?; 6. తిష్ఠద్ధోమా వషట్కార ప్రదానా యాజ్యాపురోను వాక్యావంతో యజతయః.; 7. ఉపవిష్టహోమాః స్వాహాకార ప్రదానా జుహోతయః.''

''యాగ-హవన-ములకు భేదము ఏమి? నిలుచుండియే హోమము (హవిర్థానము) చేయుటయు-అగ్నికి హవిస్సును అందించునపుడు 'వషట్‌ (వహతు=అగ్నిః ఏతత్‌ హవిః ఉద్దిష్టాందేవతాం నయతు=అగ్ని ఈ హవిస్సును ఇచట మంత్రముచే ఉద్దేశింప-పేర్కొన-బడిన దేవతకు అందజేయుగాక!) అను శబ్ధమును ఉచ్చరించవలసినవియు ఈ 'వషట్‌' ఉచ్చారణమునకు ముందు 'యాజ్యా _పురో7నువాక్యా' అను మంత్రములను కూడ పఠించవలసినవియు అగు హోమములు 'యాగములు'; కూర్చుండియే హవిర్థానము చేయవలసినవియు దేవతోద్దేశ్యక మంత్రమునకు కడపట 'స్వాహా' (సు=శోభనం=తిన్నగా; ఆవహ=ఈ హవిస్సును ఈ మంత్రముచే ఉద్దిష్టయగు దేవతకు అందజేయుమా! అగ్నీ!) అను శబ్దమును ఉచ్చరించవలసినవియు అగు హోమములు హవనములు.''

ఈ వివరణముననుసరించి ఈ శ్రీమత్స్యమహాపురాణమున ప్రతిపాదింపబడిన వానిలో అయుత హోమా దికములు 'హవనములు'.

చాంద్రమానమాసములు-నామసార్థకత:

చాంద్రమానమున మాసముల నామములు సార్థకములు; ఎట్లన- 1.చైత్రమాసము: చిత్రా నక్షత్రముతో చంద్రుడు కూడియుండు పూర్ణిమ ఈ మాసమునందుండును. ఇదే విధముగ-వైశాఖము 'విశాఖా' జ్యేష్ఠము 'జ్యేష్ఠ' ఆషాఢము 'ఆషాఢా' (పూర్వ-ఉత్తర) శ్రావణము 'శ్రవణ' భాద్రపదము భాద్రపద (పూర్వ-ఉత్తర) అశ్వయుజము 'అశ్వినీ' కార్తికము 'కృత్తికా' మార్గశిరము 'మృగశీర్ష' (మృగశిర) పుష్యము 'పుష్య' మాఘము 'మఘా' ఫాల్గునము 'ఫల్గుని' (పూర్వ-ఉత్తర) నక్షత్రములతో చం ద్రుడు కూడియుండు పూర్ణిమలు ఆయా మాసములందుండుటతో ఏర్పడిన నామములే యని గ్రహించవలయును.

నివర్తన-గోచర్మ-పరిమాణములు.

నివర్తనము - - మరుంతుర్లు [తెలుగు]

మన ప్రాచీన వాజ్మయములో ఆయా శ్రౌతస్మార్త ప్రక్రియలందు ఈ పదములు ప్రదేశ పరిమాణ వాచకముగా ప్రయోగింపబడుచుండును. (ఉదా: మత్స్య-282 అ.) ఇచట ఈ పరిమాణము ఈ విధముగా నిర్వచింపబడినది:

''దండేన సప్తహస్తేన త్రింశద్దండం నివర్తనమ్‌ |

త్రిభాగహీనం గోచర్మమాన మాహ ప్రజాపతిః.''

తా. ఏడు మూరలు దైర్ఘ్యము కలది ఒక దండము; అట్టి దండములు ముప్పది ఒక్కొక్క భుజముగా గల చతురస్రముతో అగు వైశాల్యము ఒక 'నివర్తనము;' ఇందలి మూడవ వంతు తగ్గించగా 'గోచర్మము' అని వీని మానము (కొలత)లను (మనువు-అథవా-స్వయంభూ) ప్రజాపతి నిర్ణయించెను.

ఇది చూడగా 7´30´7´30=210´210=44100 చదరపు మూరలు=ఒక నివర్తనము అగును; ఇందలి మూడవవంతు అనగా 44100¸3=14700 చదరపు మూరలు; నివర్తన పరిమాణములో నుండి దీనిని తగ్గించగా 44100-14700=29400 చదరపు మూరలు 'గోచర్మ' పరిమాణము అని తోచును. కాని ఇ ది వర్గమూలమునకు రాని సంఖ్య. సాధారణముగా ఇట్టిది వైశాల్యముగా ఉండుటలేదు. ఇదియుగాక-ఈ విషయమున వసిష్ఠ వచనము (From Vinayak Sivaram Apte's Sanskrit-English Dictionaryలో) ఇట్లున్నది:

''దశహస్తేన వంశేన దశవంశాన్‌ సమంతతః |

పంచ చాభ్యధికాన్‌ దద్యా దేతద్‌ గోచర్మ చోచ్యతే.''

తా. పది హస్తముల దైర్ఘ్యముకల దండము 'వంశము' అనబడును. ఇవి పదియు ఇంకను ఐదును (10+5=15) అన్ని (నాలుగు) వైపులను కొలువగా (అగు చతురస్రముతో) అగు వైశాల్యము 'గోచర్మము' అనబడును.

అనగా 'గోచర్మము'=10´15´10´15=150´150=22500 చదరపు మూరలు అని తెలియుచున్నది.

'నివర్తనము' విషయమున భాస్కరాచార్యులు పది మూరలు పొడవు కలది వంశము; ఇరువది వంశముల భుజముతో ఏర్పడు చతురస్రముతో అగు వైశాల్యము 'నివర్తనము' అనెను. అనగా 10´20´10´20=40000 చదరపు మూరలు ఒక నివర్తనము.

ఇట్లు భాస్కరుడును మత్స్యపురాణమును చెప్పు నివర్తనములు కొంచెము భేదముతో నున్నవి.

అట్లే గోచర్మ పరిమాణమున కూడ ఆలోచించవలెను:

మత్స్యపురాణానుసారము ఏడు మూరలు ఒక దండము; నివర్తనపు భుజమునకు ఇట్టివి ముప్పది యుండును. దానిలో మూడవవంతు (10 దండములు) తగ్గగా ఇరువది దండములు ఒక్కొక్క భుజముగా గల చతురస్రముతో ఏర్పడు వైశాల్యము గోచర్మము. అనగా గోచర్మము=7´20´7´20=140´140=19600 చదరపు మూరలు.

ఈ చెప్పిన వసిష్ఠ ప్రోక్త గోచర్మ పరిమాణముతో ఇది ఇంచుమించుగా సమానము.

రెండు హస్తములు = 1 బ్రిటిషు గజము; కనుక ఈ 19600 చ.మూ. = 19600¸4 = 4900 చదరపు గజములు [ఎకరము (4840గ.) కంటె కొంచెమెక్కువ].

ఇందు నివర్తనము <ని+వృత్‌+అన (ల్యుట్‌); మరియు-ని-వృత్‌ = మరలు; కనుక 'వివర్తనము' పూర్వకాలమున చెరువులనుండి పంట పొలముల సౌకర్యమునకై ఏర్పరచు ఒకవిధమగు అమరికకు పేరు; దీనిని బట్టియే సంస్కృతమున 'నివర్తనము'ను-తెలుగులో దీనితో సంబంధము కలదిగా 'మరుంతుర్లు' అను పదమును-ఏర్పడియుండును. ఇది తెలుగు శాసనములలో పొలపు కొలతను తెలుపు పదముగా కనబడుచున్నది.

చారిత్రక వాఙ్మయ వరిశోధకులు ఇందలి యాథార్థ్యమును నిర్ణయింతురుగాక!

'గోచర్మము' అను శబ్దమునందలి 'చర్మ' శబ్దము రూఢమగు 'తోలు' అను అర్థమునందు కాక 'మేయుట' 'మేయుటకు ఉపయోగించు పచ్చికబయలు' అను అర్థమున ఉన్నట్లు తోచును. 'చర = గతి-భక్షణయోః' అని ధాతువు; 'చర్‌ (చర)+మన్‌ (ప్రత్యయము)>చర్మన్‌' అగును. 'దీనియందు గోవులు మొదలగునవి మేయును.' అను అధికరణ వ్యుత్పత్తి చెప్పుకొనవలయును. అనగా 'కొంత సంఖ్యగల గోవులకు పచ్చికబయలుగా చాలునంత ప్రదేశము' అని అర్థము కావలయును.

ఇట్లు 'నివర్తనమ్‌' అనునది 'పంట పొలము'నకు కావలయు నీటి సౌకర్యమును- 'గోచర్మ' పదము గోవులు మేయు అనుకూలతను-దృష్టియందుంచుకొని నిష్పన్నము చేసిన పదములు అయి ఉండును. అని ఊహించవచ్చును.

ముగింపు

'శ్రౌతస్మార్త కర్మములయందు వానికి అంగములుగా వేదములందలి మంత్రములచే గ్రహింపవలయును'. అనుటచే పురాణ గత వచనములు కర్మాంగములుగా శ్రౌతస్మార్తకర్మములందు గ్రహింపదగినవి కాకపోవచ్చును.

అయినను అవి తత్త్వ ప్రతిపాదకములుగ ఉండుట విషయమున వేదతుల్యములు.

ఇట్లు పురాణములకు గల ప్రామాణ్యమును కర్మకాండను ఉపాసనాకాండను జ్ఞానకాండను జనులకు అవి అందజేయుచున్న తీరును ఆలోచింపగా పురాణములయందలి ప్రతిపాద్య విషయములను యుక్తి యుక్తముగా సంప్రదాయాను కూలముగా స్పష్టముగా ఎరుగుట ఆవశ్యకము.

ఈ ఉద్దేశ్యముతో ఆరంభించిన ఈ పనిలో అనువాదకుడు తను దాను 'జిజ్ఞాసువు అగు సాధారణ పఠిత'నుగా భావించి 'పఠితలకు ఆయా విషయములు నిస్సంశయముగా తెలియుటకు అనుకూలించును'. అని ఈ వివరణములు గ్రంథాదియందు ఇచ్చుట జరిగినది.

ఇందు కొన్ని విశేష జిజ్ఞాసతో ఈ పురాణమును పఠించువారికి మాత్రము ఉపయోగించునవి కావచ్చును.

వారి వారి అభిరుచిననుసరించి వానిని వారు ఉపయోగించుకొందురుగాక !

ఇందు వ్రాసిన యంశములు సంప్రదాయానుగతములయి ప్రామాణికములయి యున్నంతవరకు అందులకు శ్రీ మదుభయ వేదాంత ప్రవర్తక లక్ష్మణాచార్యాది గురువుల కరుణయే హేతువు; దొసగులకు అనువాదకుని అసమర్థతయే మూలము.

హైదరాబాదు. అని మనవి చేయు-

ది. 17-10-1986. అనువాదకుడు.

ప్రీయతాం భగవా న్విష్ణు ర్మత్య్సరూపీ జనార్దనః|

వాచాపుషై#్పః ప్రకృతయా7త్యల్పయా సేవయా7నయా.

ఓం తత్‌ సత్‌.

Sri Matsya Mahapuranam-1    Chapters